Gurramseetaramulu:
ఉద్యమం జోరుగా ఉన్న రోజుల్లో తెలుగు తల్లి మీద కెసిఆర్ ఒక పెద్ద అబాండం వేశాడు..
ఎవనికి పుట్టిన తల్లి’..?
ఆయన భాష యాస చూసి మోజు పడిన జనులు కెసిఆర్ మాట్లాడే భాష నే అధికారిక భాష అవుద్ది అని ఆశ పడ్డాం. పాలన మారాకా తెలుగు తల్లి విగ్రహానికి చేతిలో కలశం తీసి బాలనాగమ్మ చీర కట్టి (గులాబీ రంగు) బతుకమ్మ చేతిలో పెట్టి ఇదే తెలంగాణ తల్లి అన్నారు జనాలు నమ్మారు..
తెలుగు తల్లి తెలంగాణ తల్లి యెందుకు అయ్యింది నో ఒక్క సన్నాసి మాట్లాడ లేదు
ఎందుకంటే దొర కట్టిన చీర పెట్టిన నగలు పట్టిన బతుకమ్మ మూర్తీభించిన తెలంగాణ తల్లి కి చిరునామా కనుక.
భాజాపా పెట్టుడు కానుక బారాసా భరోసా తెలంగాణ తల్లి..ఇప్పుడు పాలన మారింది చీర రంగు మారింది నెత్తిన కిరీటం బతుకమ్మ మాయం అయ్యింది పాలన మారినప్పుడల్లా మారడానికి
అది అంగట్లో దొరికే మిఠాయి కాదు.
తరాల తండ్లాట..
మజ్జ లో ఇంకిన అస్తిత్వం ..
అది మా పోరు మీరు కట్టిన చీరలు పెట్టిన
నగలు యేవీ శాశ్వతం కావు..
కానీ ఈ భుజ కీర్తులు కిరీటాలు బతుకమ్మ లు బ్రతుకు మార్చవు..
మీ చీకటి జెండాలు ఎజెండాలు ఏమైనా ఉండొచ్చు తెలంగాణ తల్లి అంటే మీ దొడ్లో కట్టేసిన కట్టు బానిస కాదు మీ టేబుల్ మీద ఆష్ ట్రె కాదు. అమ్మ కదా పెయ్యి మీద నగ నట్ర లేకున్నా బాగానే ఉంటది.
కచరా తల్లి కాంగ్రెస్ తల్లి రెండు వేరు వేరుగా ఉండవు..
యెవరో ఒకాయన ఆమె చేతి గుర్తుకు ఓటు వేయమని అడుగుతోంది అంటాడు. ఇంకొకాయణ చీర కు అదనంగా రంగేస్తే మీ జెండా అవుద్ది ఆన్నాడు.కట్టుకున్న చీర మీద చేయి చూపిన స్త్రీ మీద మీ నైచ్యం అంతే. సరే ఇక్కడ డెబ్బై ఏళ్ల లో మారిన తల్లుల నగలు మార్చిన చీరె రంగులు చూపుతున్న..
కొత్త తల్లికి ఇప్పుడు కొత్తగా నెత్తిన కిరీటం తీసేసారు. ఇప్పుడు భూమి భళ్ళున పగిలి పోతుంది అన్నమాట. చేతిలో బతుకమ్మ మాయం అయ్యింది. ఇక నుండి తెలంగాన లో బతుకమ్మ కు అరిష్టం జరుగుద్ది. చీర గులాబీ రంగు నుండి ఆకుపచ్చ రంగులోకి మారింది. మీరు పుట్టక ముందే రంగులు ఉన్నాయి. పగటి వేష గాళ్ళ (వాళ్ళ అంత నియ్యతి ఎవడికీ లేదు) లాగా పార్టీ జెండాలు పేర్లు ఊసర వెళ్ళు ల్లా మీరు మారొచ్చు తల్లులు కట్టుకున్న వలువలు యే పాటివి ?
గ్రామీణ ప్రాంతాలలో ప్రతి వూరిలో దేవతా విగ్రహాలు అభయ హస్తం తో ఉంటాయి..
దేవతలు అందరూ JAC గా ఏర్పడి హస్తం పార్టీ లో చేరారు అన్నమాట..
మీరు మీ బ్రతుకులు… తూ..