Kollywood
అనారోగ్యంతో కన్నూమూసిన నటి మీనా భర్త!
ప్రముఖ నటి మీనా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. జనవరిలో కరోనా సోకింది. ఈనేపథ్యంలో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది . దీంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు….
సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్..
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన రజినీ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఓ సర్జరీ కూడా చేశారు. అది విజయవంతంగా పూర్తైందని వైద్యులు వెల్లడించారు. దీంతో సూపర్ స్టార్ అభిమనులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా 70ఏళ్ల రజనీకాంత్ ఇటీవలే దిల్లీకి వెళ్లి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తీసుకున్నారు. అక్కడ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి…
ఆస్పత్రిలో చేరిన రజినీ..!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు రజనీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు వారు వెల్లడించారు.కాగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు రెండు రోజుల క్రితం రజినీ దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలుసుకున్నారు.
నటుడు సూర్యకు కరోనా పాజిటివ్!
తమిళ అగ్ర నటుడు సూర్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, అభిమానులు ఆందోళన చెందవద్దని సూర్య స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం నుంచి మనం ఇంకా బయటపడలేదని , అందరూ జాగ్రత్తగా ఉండాలి, నాకు చికిత్స చేస్తున్న వైద్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ సూర్య ట్వీట్ చేశారు. …