ముక్కోటి ఏకాదశి విశిష్టత..!
డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్ : ధనూరాశిలో సూర్యుడు సంచరించే మాసం- ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ముక్కోటి దేవతలైన బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలు అసురశక్తులపై విజయాన్ని సాధించడానికి శ్రీహరి అనుగ్రహాన్ని ఆకాంక్షించాయి. శ్రీహరి దర్శనాన్ని పొంది, విష్ణు కరుణకు పాత్రులయ్యాయి. సకల దేవతలూ వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే- ముక్కోటి ఏకాదశి. ధనుస్సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు…