MaharashtraexitPoll: ‘మహాయుతి’కి జైకొట్టిన మహారాష్ట్ర: పీపుల్స్ పల్స్
Maharashtra exit Poll2024:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘మహా’సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగున్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ పంచన చేరడంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ శిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్,…