Nconvention: ఎన్ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె..!
Nancharaiah merugumala senior journalist: నాడు అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఎన్టీఆర్ నోటీసులతో ఏఎన్నార్‌కు గుండెపోటు..నేడు ఎన్ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె! కొన్న స్థలం నుంచి ప్రజల సంపదలో భాగమైన చెరువులోకి చొరబడి నిర్మాణం చేశారనే కారణంపై హైదరాబాద్ ఐటీ కేంద్రం మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ అనే కొన్నెకరాల విస్తీర్ణంలో కట్టిన భవనాలను తెలంగాణ సర్కారు శనివారం కూల్చేస్తోందనే వార్తలు వేగంగా వచ్చిపడుతున్నాయి. దీని యజమాని దివంగత తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు చిన్నకొడుకు నాగార్జున…