అతిథి అధ్యాపక పోస్టుల కోసం అప్లై చేసుకోండి : ప్రిన్సిపల్ శైలజ

సూర్యాపేట: బాలెం గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ డా. శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీ, బోటని, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్.. అతిధి ఆధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నట్లు వెల్లడించారు. సంబంధిత pG లో 55 శాతం (ఎస్సీ, ఎస్టీలు 50 శాతం) మార్కులు పొందిన వారు అర్హులుగా పేర్కొన్నారు.ph.D/ Net/set/slet ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు.. అర్హత గల అభ్యర్థులు, ఫిబ్రవరి 4 వ తేదీ సాయంత్రం…

Read More

నల్గొండ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అపూర్వ రావు IPS

నల్లగొండ: నల్లగొండ జిల్లా ఎస్పీగా అపూర్వ రావు IPS బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరి రామగుండం సి.పి గా బదిలీపై వెళ్ళారు. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం..జిల్లా ఎస్పీ కార్యాలయంలో అపూర్వ రావు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు.. ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పుష్పంగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మోగిలయ్య, నల్లగొండ డిఎస్పీ, నరసింహ రెడ్డి,దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు,మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర…

Read More

లైంగిక బాధిత మ‌హిళ‌లకు తక్షణ ఆర్ధిక సహాయం: ఎస్పీ రెమా రాజేశ్వరి

న‌ల్ల‌గొండ‌:  ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా .. లైంగిక వేధింపుల ద్వారా మోస‌పోయిన  మ‌హిళ‌లకు  పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో త‌క్ష‌ణ‌ ఆర్థిక స‌హాయం అంద‌జేశామ‌న్నారు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. బాధిత మ‌హిళ‌లకు భరోసా సెంటర్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.పోలీసు భరోసా సెంటర్, షీ టీమ్స్ .. ప్రజలకు, బాధితులకు అందించవలసిన సేవల గురించి వివరించిన ఎస్పీ.. 10 మంది మ‌హిళ బాధితుల‌కు.. ఆర్ధిక సహాయాన్ని భరోసా కేంద్రం నుండి అందించడం జరిగిందన్నారు. బాధిత…

Read More

యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలి:  జేడి లక్ష్మీనారాయణ

నల్గొండ:యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలని హితవు పలికారు  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో జనగణమణ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ  ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఎగురవేశారు. అనంతరం జాతీయ సమైక్యత మీద జరిగిన పోటీలలో ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. లక్షలాదిమంది త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని.. అలాంటి…

Read More

ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా : మంత్రి జగదీష్

సూర్యాపేట: తెలంగాణా అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూపొందించిన 2023 డైరీ క్యాలెండర్ ను ఆయన శనివారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విద్యుత్ కాంట్రాక్టర్లతో పాటు యావత్ రైతాంగానికి ఎంతో దోహదపడుతుందన్నారు జ‌గ‌దీష్ రెడ్డి.సుదూర ప్రాంతాల నుండి ట్రాన్స్ఫార్మర్స్ ఇతర పరికరాలు సరఫరా చేసే భారం తప్పిందని గుర్తు చేశారు. కొత్త జిల్లాల…

Read More

వచ్చే ఎన్నికల్లో గెలుపు నాదే: సంకినేని వెంకటేశ్వర్ రావు

సూర్యాపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో విజయం తనదేనని ధీమా వ్యక్తంచేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు.రెండుసార్లు ఓటమి పాలైన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని  తెలిపారు. తన వెంట ఉన్న నాయకులందరినీ అధికార పార్టీ డబ్బులతో లొంగదీసుకున్నా.. నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. 2014లో పార్టీ టికెట్ రాకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే.. నియోజక వర్గ ప్రజలు చూపించిన ఆదరణను  మర్చిపోలేదని సంకినేని గుర్తు…

Read More

ఆరునూరైనా సూర్యాపేటలో కాషాయ జెండా ఎగరేస్తాం: సంకినేని వెంకటేశ్వరరావు

తెలంగాణలో కొనసాగుతున్న అవినీతి పరిపాలనను అంతం చేయడానికి బీజేపీ  సిద్ధమైందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. శనివారం జరగనున్న పోలింగ్ బూత్ కార్యకర్తల సమ్మేళనం సభా స్థలిని ఆయన కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ ద్వారా పోలింగ్ బూత్ కార్యకర్తల తో మాట్లాడి దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. రాష్ట్రం తో పాటు, సూర్యాపేటలో జరుగుతున్న అవినీతిని కార్యకర్తల సమన్వయంతో ప్రజల్లోకి…

Read More

7 వ తేదీన పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం: సంకినేని

సూర్యాపేట: తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణను రూపొందించిందన్నారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. పార్టీ ఆదేశానుసారం.. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు. గురువారం సంకినేని నివాసంలో నియోజక వర్గ శక్తి కేంద్ర ఇంచార్జ్ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. ఈనెల 7వ తేదీన త్రివేణి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ  పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ అధ్యక్షులు జేపీ…

Read More

పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి: ఎస్పీ రెమా రాజేశ్వరి

 నల్లగొండ: ఎస్సై, కానిస్టేబుల్  దేహదారుడ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయాని జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి  పేర్కొన్నారు.రాష్ట్ర పోలీసు నియామక మండలి నియమాల ప్రకారం  ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా..పూర్తి సాంకేతికత పరిజ్ఞానంతో  పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం  జరిగిందన్నారు. జిల్లా పోలీస్ అధికారులు..సిబ్బంది.. ఇతర సాంకేతిక నిపుల సహకారంతొ ప్రశాంతంగా దేహదారుఢ్య (ఫిజికల్ టెస్ట్స్) పరీక్షలు ముగిశాయని ఎస్పీ వెల్లడించారు. ఇక మొత్తం 26 వేల 433 మంది అభ్యర్థులకు గాను.. 23 వేల 524 మంది…

Read More
Optimized by Optimole