తెలంగాణలో తెరుచుకోనున్న థియేటర్లు..! Telangana

తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకొనున్నాయి. ప్రభుత్వ హామీ మేరకు థియేటర్లు తెరవాలని సిని ఎగ్జిబిటర్లు, థియేటర్లు నిర్వాహకులు నిర్ణయించారు. కరోనా లాక్ డౌన్ తో ఏడాది నుంచి థియేటర్లు మూసి ఉంచిన నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్నామని.. ఆదుకోవాలని ఎగ్జిబిటరర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం చాంబర్, సినీ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సునీల్‌ నారంగ్, అనుపమ్‌రెడ్డి, అభిషేక్‌ నామా, సదానంద్‌గౌడ్, బాలగోవింద్, రాజ్‌తాడ్ల తదితరులు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి వినతిపత్రాన్ని…

Read More

తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినేట్ మంత్రిగా ‘కిషన్ రెడ్డి’..

సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. విద్యార్ధి దశ నుండే జాతీయవాదాన్ని పుణికి పుచ్చుకుని.. నమ్మిన సిద్ధాంతాన్ని సమాజంలో విస్తరింపచేస్తూ.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి.. తెలంగాణ తరపున తొలి కేబినేట్ మంత్రిగా ఎదిగిన గంగాపురం కిషన్ రెడ్డి ప్రస్థానం ఎందరో యువనేతలకు ఆదర్శం. సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి దాకా… కిషన్రెడ్డి ప్రస్థానం విద్యార్థి దశ నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గంగాపురం కిషన్‌రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని ఓ సామాన్య రైతు…

Read More

ఈటెల రాజేందర్ కు అడుగడుగునా జన నీరాజనం!

తెలంగాణ మాజీ మంత్రి బిజెపి నేత ఈటెల రాజేందర్ కు ప్రజ్ఞాపూర్, సిద్దిపేట రహదారిలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈటలకు దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించడమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. గ్రామగ్రామాన, వాడవాడలా బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. గజ్వేల్‌లో ఆనాడు నేను ఉద్యమంలో చేరా. సొంత నియోజకవర్గంతోపాటు ఇక్కడి ప్రజానీకంతో నాకు ఎంతో…

Read More

తెలంగాణ లో లాక్ డౌన్ మరో పదిరోజులు పొడగింపు: కేబినెట్ నిర్ణయం

తెలంగాణలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి ( మే 31 నుంచి ) మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయంలో బయటకు వెల్లినవాల్లు తిరిగి ఇంటికి చేరడానికి మరో గంట పాటు, (సడలింపు సమయానికి అధనంగా) అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులు బాటు ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం రెండు…

Read More

తెలంగాణలో లాక్ డౌన్ మరో వారం రోజులు పొడగింపు..?

తెలంగాణలో కరోనా కట్టడి దృష్ట్యా విధించిన లాక్ డౌన్ గడువు జూన్ 30న ముగియనుంది. అయితే లాక్ డౌన్ కొనసాగించాలా.. లేదా అన్నది రేపు జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నపట్టీకి.. మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రజలుభారీగా బయటకురావడం.. మినహాయింపుల పేరుతో మరికొందరు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో.. విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. మంత్రివర్గ సమావేశం(ts cabinet meeting)లో చర్చించి నిర్ణయం తీసుకునే…

Read More

తాత్కాలిక సిబ్బందిని నియమించండి : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ పోరు మొదటి శ్రేణి యోధులైన వైద్య ఆరోగ్య సిబ్బంది పై ఒత్తిడి తగ్గించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా ఈ రెండు మూడు నెలల కోసం, వైద్యుల, 50 వేల తాత్కాలిక సిబ్బందిని నియమించాలని వైద్య శాఖ కు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులుపై ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత, రెసిడెమివర్ ఇంజక్షన్స్, పడకలు…

Read More

తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు : సీఎం కేసీఆర్

కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై వస్తున్న ఊహాగానాలకు సీఎం కేసీఆర్ తెరదించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. లాక్ డౌన్ వలన జనజీవనం స్తంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకులే ప్రమాదముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్సిజన్లు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు, పడకలు వంటి విషయాలపై చర్చించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను…

Read More

రాబోయే మూడు నెలలు కీలకం : డాక్టర్ శ్రీనివాసరావు

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు సూచించారు. ఏ మాత్రం ఏమరుపాటు పనికి రాదని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని , కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని తెలిపారు. రాబోయే మూడు నెలలు చాలా కీలకమైనవని, ముఖ్యంగా పిల్లలు యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. 70% ఈ రెండు గ్రూప్ లో వాళ్లు ఎక్కువగా ఉన్నారని, మిగిలిన 30% మిడిల్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారని వారు స్పష్టంచేశారు….

Read More

తెలంగాణకు కరోనా ముప్పు పొంచి ఉంది : డాక్టర్ శ్రీనివాసరావు

రాష్ట్రానికి కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పుపొంచి ఉందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండకపోతే కోవిడ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పక పాటించాలని.. పండగలకు పిల్లలు వయోవృద్ధులు దూరంగా ఉండాలని సూచించారు. గత అయిదారు నెలలుగా ప్రజలు జాగ్రత్త పాటించకపోవడమే కేసుల పెరుగుదలకు కారణమని శ్రీనివాస రావు పేర్కొన్నారు. కోవిడ్ కేసుల పెరుగుదలకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన…

Read More

‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలి : ప్రధాని మోదీ

కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలు ‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ 10% పైగా వృథాగా  ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ గురించి బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వ్యాక్సిన్‌ వృథా విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  వ్యాక్సిన్‌ ఎందుకు వృథా అవుతోందన్న దానిపై, దానిపై ప్రత్యేక సమీక్ష జరగాలని, ప్రతిరోజూ సాయంత్రం దీన్ని…

Read More
Optimized by Optimole