Tollywood
నరేష్ తో పెళ్లి.. స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర లోకేష్ సంచలన వ్యాఖ్యలు!
నటుడు నరేష్ తో వివాహం పై నటి పవిత్ర లోకేష్ స్పందించారు. కన్నడ మీడియాకు చెందిన ఓ టీవీ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర సంచలన విషయాలను వెల్లడించారు. నరేష్ తో సహజీవనం చేస్తునట్లు చెప్పుకొచ్చారు. అతని కుటుంబ సభ్యులు తనని ఓ కుటుంబ సభ్యురాలిగా చూశారన్నారు. తమకు కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నారు. పెళ్లి విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రస్తుతానికి కలిసే ఉంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇక ఇటీవలే…
అనారోగ్యంతో కన్నూమూసిన నటి మీనా భర్త!
ప్రముఖ నటి మీనా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. జనవరిలో కరోనా సోకింది. ఈనేపథ్యంలో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది . దీంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు….
టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు శుభవార్త అందించింది. సినిమా టికెట్స్ రేట్లనూ సవరిస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా సినిమా టికెట్ రేట్లను నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్లు.. నాలుగు కేటగిరీలుగా విభజిస్తూ.. కనీస టికెట్ ధర రూ. 20.. గరిష్టంగా రూ. 250 గా రేట్లు నిర్దారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‌లు.. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ గా నిర్ణయించారు. ఒక్కో థియేటర్‌లో కేవలం రెండే…
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహరి కన్నుమూశారు.గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బప్పిలహరి 1952, నవంబర్ 27న జన్మించారు. భారత చిత్రసీమకు డిస్కోను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ఆలపించిన పాటల్లో.. ‘చల్తే చల్తే’, ‘డిస్కో డ్యాన్సర్’, ‘షరాబీ’ వంటి గీతాలు యువతను ఉర్రూతలూగించాయి. హిందీ, తెలుగు, బెంగాళీ, తమిళం, కన్నడ, గుజరాతీ చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా…
సూపర్ స్టార్ సోదరుడు మృతి.. షాక్ లో అభిమానులు!
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేశ్ బాబు సోదరుడు…ఘట్టమనేని రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన….శనివారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటహుటీన AIG ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. కాగా రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసినమనుషులు చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏడేళ్ల విరామం అనంతరం సామ్రాట్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నారు.ఆయన దాదాపుగా…
సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా పాజిటివ్!
సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనే ఈవిషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని… స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సలహాలు తీసుకుంటున్నట్లు మహేష్ చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరే ప్రమాదం తక్కువగా ఉంటుందని.. అందుకే ప్రతీ ఒక్కరు టీకాలు తీసుకోవాలని… అలాగే కోవిడ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి..!
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రసిద్ధి చెందిన రాజబాబు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన గత రాత్రి మృతి చెందారు. 64 సంవత్సరాల రాజబాబు 62 సినిమాల్లో నటించి మంచి పేరు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసరావుపేట. చిన్నటప్పటి నుంచే నటనపై మక్కువ పెంచుకున్న ఆయన దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 1995లో ఊరికి మొనగాడు సినిమాతో…