KCR: కేసీఆర్ 3.0
KCR: కేసీఆర్ కోలుకున్నట్టున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఒంటికి తగిలిన గాయం నుంచి ఇదివరకే కోలుకున్నా, రాజకీయ గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలకు ఇప్పుడొక గట్టి హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. ఇరువురికీ సమదూరం పాటించే పోరాట రాజకీయ పంథా ప్రకటించారు. విషాన్ని గొంతుకలో నిలుపుకున్న గరళకంఠుడ్ని అని చెబుతూ.. ఏ క్షణాన్నయినా బద్దలయే అగ్నిపర్వతంలా ఉన్నానన్నారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైళ్లో ఉన్న కూతురు కవిత పరిస్థితిపై…