Nancharaiah merugumala senior journalist:
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిస్ట్ రిపబ్లిక్స్ (ఎఫ్.ఐ.సీ.ఆర్) అని మన దేశం పేరును మార్చుకోవచ్చని 1960ల చివర్లో, 1970ల ఆరంభంలో లక్షలాది మంది జనం అనుకునేవారు. ‘ప్రజా పోరాటాలు’ విజయవంతమయ్యాక నూతన ప్రజాస్వామ్యం పరిఢవిల్లే భారత ఉపఖండం యావత్తూ కొత్త బంగారులోకంగా మారుతుందని ఆశించేవారు. ఎఫ్.ఐ.సీ.ఆర్ అనే ఈ ప్రతిపాదిత పేరు నాటి అగ్రరాజ్యాల పేర్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్యే), యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (యూఎసెసార్)కు దీటుగా ఉంటుందని భావించేవారు. ఇప్పుడేమో యూఎసెసార్ కనుమరుగైంది. యూఎస్యే నెమ్మదిగా యునైటెడ్ ఇండియన్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా (యూఐఎస్యే) అవతరించే దిశగా పరుగులు తీస్తోంది. ఇండియా లేదా భారత్ అనే మూడక్షరాల పేరు దేశానికి అచ్చి రాలేదనేది బహుసంఖ్యాకులైన భారతీయుల అభిప్రాయంగా వినిపిస్తోంది. మూడు వైపులా సముద్రాలున్న దేశానికి మూడక్షరాల పేర్లు మేలు చేయవని కూడా సంఖ్యాశాస్త్రవేత్తలూ యూట్యూబ్ చానళ్లలో చెబుతున్నారు.