×

BJPTelangana:‘‘ కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేనొక్కటే చెప్పిన….  మీరేం భయపడకండి… ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండి’’అంటూ రెచ్చిపోయారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఆదివారం  చేవెళ్ల జరిగిన ‘‘విజయ సంకల్ప సభ’’లో  మాట్లాడిన సంజయ్ ప్రసంగంతో దంచేశారు. భారత్  మాతా కీ జై… జై శ్రీరాం… అందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక్క విషయం చెబుతా.. హిందీ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నన్ను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారు. 8 గంటలు రోడ్ల మీదే  తిప్పారు. కరీంనగర్ దాటినంక నా భార్య ఫోన్ చేసింది. ఢిల్లీ నుండి ఫోన్ చేశారని చెప్పింది. నన్ను కొత్తపేట, ప్రజ్ఝాపూర్, భువనగిరి తీసుకుపోతున్నరు.. అక్కడికి ఓ కానిస్టేబల్ వచ్చి… యాడికి తీసుకుపోతున్నరో అర్ధం కావడం లేదని భయపడుతున్నమన్నా అని చెప్పిండన్నా… అప్పుడు నేను చెప్పిన… మీరేం భయపడకండి… ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం ప్రారంభించింది. కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండని సంజయ్ అనగానే..సభలో ఉన్న వేలాది మంది స్వచ్ఛందంగా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. తెలంగాణను అభివ్రుద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం ఇక్కడికి వస్తుంటే కేసీఆర్ అడుగడుగునా అడ్డుకుంటోందన్నారు. ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే.. అభివ్రుద్ధి  ఏంటో చూపిస్తామన్నారు. పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం.. ఫసల్ బీమా ..ఇండ్లను నిర్మిస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి.. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని సంజయ్ చెప్పుకొచ్చారు.

కాగా తెలంగాణలో రాక్షస రాజ్యాన్ని, కుటుంబ పాలనను, నియంత పాలనను కూకటి వేళ్లతో పెకిలించివేసేందుకు అమిత్ షా ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చామన్నారు సంజయ్. మీ అందరూ ఆశీస్సులివ్వాలని కోరుతున్నామన్నారు. లాఠీదెబ్బలకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇంతపెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ రెండు చేతులెత్తి జోడిస్తున్నా..భారత్  మాతా కీ జై… జై శ్రీరాం… అందరికీ నమస్కారం అంటూ సంజయ్ ప్రసంగాన్ని ముగించారు.

(ఇటీవల బీజేపీలో చేరిన నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు పరిచయం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. చిత్రంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి)

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all
Optimized by Optimole