రేవంత్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..

Revanthreddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. బుధవారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో అతిరథ మహారథులు సమక్షంలో రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ వెళ్లిన రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ నేతలతో వరుసగా సమావేశం అవుతూ తనకు సీఎం అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

కాగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ ముఖ్య నేత చెప్పుకొచ్చారు.

Optimized by Optimole