పానీపూరి తింటున్నారా? మీ పని కథమే.. ఎందుకో ఈవీడియో చూడండి!

పానీపూరి ప్రియులకు చేదువార్త. ఇదేంటి ఇలా అంటున్నారని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే ఈవీడియో చూస్తే జీవితంలో పానీపూరి జోలికి వెళ్లరు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే వీడియో ఎవరూ పోస్ట్ చేశారు. ఎక్కడ రికార్డ్ చేశారన్నది మాత్రం క్లారీటీ లేదు.

 

ట్విట్టర్  పోస్టు చూసినట్లయితే.. ఓ వ్యక్తి ‘పానీపూరీ’నీళ్లతో నిండిన కంటైనర్ లో టాయిలెట్ క్లీనర్ హర్పిక్ ను కలుపుతున్నాడు. అతను ఎవరన్నది గుర్తు పట్టకుండ ముసుగు ధరించాడు. పానీపూరి సిద్ధం చేసేందుకు కట్టెల పోయ్యి ముందు నిలబడి వేరే వ్యక్తులతో సంభాషిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈవీడియోల పట్ల  నెటిజన్స్ విపరీతంగా స్పందిస్తున్నారు..పానీ పూరిని  ఇష్టపడి తినే మహిళలు ఈ వీడియో కచ్చితంగా చూడాల్సిన అవసరం ఉందని  ఓ నెటిజన్  కామెంట్ చేశాడు. ఇంత ఘోరమా అని మరోకరు .. ఇలాంటి పనులు చేసేవారిని జైలుకు పంపాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

Optimized by Optimole