Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన భారీ విరాళం ప్రకటించారు. వయనాడ్ బాధితుల సహయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 2 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ప్రభాస్ టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ.. డార్లింగ్ మనసు బంగారం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అటు సినీఅభిమానులు సైతం గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ నూ ఆకాశానికెత్తుతున్నారు.
ఇక కేరళ వయనాడ్ విషాదం మాటలకందనిది. కొండచరియలు విరిగిపడి ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు విడిచారు. చాలామంది గల్లంతాయ్యారు. వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈనేపథ్యంలోనే పలు ఇండస్ట్రీలకు చెందిన సినీతారలు ముందుకొచ్చి ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్, అల్లుఅర్జున్, కోలీవుడ్ నుంచి సూర్యదంపతులు ,కార్తీ, విక్రమ్, నయనతార దంపతులు, కమలహసన్,హీరోయిన్ రష్మీక తమవంతు విరాళాలు ప్రకటించారు.తాజాగా ప్రభాస్ 2 కోట్లు విరాళం ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నారు.