2023
అవినీతిపై ప్రధాని ఆంధ్రాలోనూ సర్పయాగం నిర్వహించాలి: ఎంపీ రఘురామ
అవినీతి సర్ఫాల ఆట కట్టించేందుకు ఢిల్లీలో మొదలుపెట్టిన సర్పయాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొనసాగించాలని కోరారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఢిల్లీ మద్యం కుంభకోణం స్ఫూర్తితో, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మద్యం కుంభకోణంపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో అసలు మద్యం కుంభకోణం అన్నదే చోటు చేసుకోలేదని తేలితే తమ పార్టీకే మంచిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మద్యం కొనుగోళ్లు, అమ్మకాలు, నగదు లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర…
సీఎం పర్యటన ఉంటే బాధితులకు వైద్య సేవలు నిలిపివేస్తారా: నాదెండ్ల మనోహర్
తెనాలి: తెనాలిలో సీఎం జగన్ పర్యటనపై జన సేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు.సీఎం పర్యటన ఉంటే ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో సేవలు నిలిపివేస్తారా? అని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా ఆగిపోయినందున ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం లేదని చెప్పడంతో మూడు నిండు ప్రాణాలు బలైపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం సభ కోసం తరలిస్తున్న భారీ జనరేటర్ వాహనాన్ని గరువుపాలెం దగ్గర ఆటో ఢీ కొని ముగ్గురు…
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ అపూర్వ రావు
నల్లగొండ: జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఎస్పీ అపూర్వ రావు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు. అనంతరం పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కేసుల సంఖ్య తగ్గించి..పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల సత్వర పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి…
ఈశాన్య రాష్ట్రాల పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ రిపోర్టు.. ఎక్స్ క్లూజివ్ ..!
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది. సర్వే ఫలితాలను సంస్థ డైరెక్టర్ దీలిప్ రెడ్డి సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఇక సర్వే రిపోర్టు ప్రకారం ..త్రిపురలో అధికార పగ్గాలు చేపట్టాలంటే 31 సీట్లు రావాల్సి ఉండగా.. అధికార బీజేపీకి 18 నుంచి 26 సీట్లు, సీపీఐ(ఎం) ఇతర లెఫ్ట్ పార్టీలకు 14 నుంచి 22, తిప్రా మోతా పార్టీకి 11 నుంచి 16 సీట్లు,…
రసకందకాయంగా ఎల్బీనగర్ నియోజకవర్గ రాజకీయం..
ఎల్బీనగర్ నియోజకవర్గ రాజకీయం రసకందకాయంగా మారింది. అధికార బిఆర్ ఎస్ అంతర్గత పోరుతో సతమతమవుతుంటే.. ప్రతిపక్ష బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికమంది కార్పొరేటర్లు ఇక్కడి నుంచి గెలవడంతో కమలం పార్టీ ముఖ్య నేతలు కన్ను నియోజకవర్గంపై పడింది. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇక్కడి నుంచే పోటిచేయాలని పట్టుదలతో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక ఎల్బీనగర్ నియెజకవర్గంలో అధికార బిఆర్ఎస్ పార్టీ అధిపత్య పోరుతో సతమతమవుతోంది. ఎమ్మెల్యే…
నేలపట్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
యాదాద్రి _ భువనగిరి: నేలపట్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కు చెందిన 1997_98 విద్యా సంవత్సరం పదో తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్దులు.. ఉపాధ్యాయులకు శాలువా కప్పి , సరస్వతి దేవి జ్ఞాపికతో సన్మానించారు. విద్యార్థులు తమ పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.తమ విద్య, వైవాహిక జీవిత విశేషాలను స్నేహితులతో పంచుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు.
బిజెపి ని ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట: జాతీయ స్థాయిలో బిజెపి ని ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి . నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నదన్నారు.ఇక్కడి గల్లీ కాంగ్రెస్ నాయకత్వం తో ఆ పార్టీ క్యాడర్ విసిగిపోయారని ఆయన చెప్పుకొచ్చారు.అభివృద్ధి, ఎజెండా లు ఏమి లేకుండా బూత్ మాటలకే గల్లీ నాయకులు పరిమితం కావడంతో ఆ పార్టీ క్యాడర్ బి ఆర్ యస్ లోకి బారులు తిరుతున్నారన్నారు. సూర్యపేట పురపాలక…
