Kollywood:
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. అయితే ఈసారి ఆ ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. అనిరుధ్‌కు బంధువైన సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారు? పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది?
గత కొన్ని నెలలుగా అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఇరు కుటుంబాలు ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వైజీ మహేంద్రన్… తాను విన్న సమాచారం ప్రకారం అనిరుధ్, కావ్య మారన్ వివాహం త్వరలోనే జరగవచ్చని తెలిపారు. కావ్య మారన్ సాధారణ అమ్మాయి కాదని.. సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి పెద్ద ఫ్రాంచైజీని సమర్థంగా నిర్వహించే నాయకత్వం ఆమెకు ఉందని ప్రశంసించారు. అలాగే అనిరుధ్ ఎంతో వినయశీలి, ప్రతిభావంతుడని కొనియాడారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నవంబర్ లేదా డిసెంబర్‌లో స్పెయిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, అనంతరం చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ వంటి వార్తలకు మాత్రం ఇప్పటి వరకు అధికారిక ధృవీకరణ లేదు. ఈ వివరాలు కేవలం ప్రచారంగా మాత్రమే ఉన్నాయి.
మొత్తానికి… వైజీ మహేంద్రన్ వ్యాఖ్యలతో ఈ పెళ్లి ప్రచారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే అనిరుధ్ రవిచందర్ లేదా కావ్య మారన్ కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి పెళ్లి తేదీ, వేదిక వంటి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే వరకు ఇవన్నీ ప్రచారంగానే పరిగణించాలి. అధికారిక ప్రకటన వస్తేనే ఈ వార్తకు పూర్తి స్పష్టత రానుంది.
