×
In

భారత సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈవిషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపాడు.’20 ఏళ్ల కెరీర్ లో దేశానికి,రాష్ట్రానికి ప్రాతినిధ్య వహించడం గర్వంగా భావిస్తున్నానని.. తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు ధన్యవాదాలు అంటూ.. ఈప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. తననూ రాటుదేలాల చేశాయని.. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభింబోతున్నట్లు ‘ రాబిన్ ట్విట్లో  రాసుకొచ్చాడు.

ఇక కర్ణాటకు చెందిన ఉతప్ప.. 2007 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో సభ్యుడు.అతడి ప్రతిభకు కొదవలేకున్న..టీంఇండియాలో ఇలా వచ్చి అలా వెళుతుండేవాడు. ఐపీఎల్​లో మాత్రం తనదైన మార్క్​ ఆటతీరుతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాడు.ఇంటర్నేషనల్ క్రికెట్ లో 46 వన్డేలు, 12 టీ20లు ఆడిన అతను.. టెస్టు జట్టులో మాత్రం చోటు సంపాదించుకోలేకపోయాడు. కానీ ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో మాత్రం అదరగొట్టేశాడు. ఇప్పటి వరకు 205 మ్యాచుల్లో 130.30 స్ట్రైక్‌రేట్‌తో 4,952 పరుగులు సాధించాడు. ఇందులో 27 అర్ధశతకాలు ఉన్నాయి. బెంగళూరు, రాజస్థాన్‌, ముంబయి, కోల్‌కతా, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో.. వన్డేల్లో 6 హాఫ్ ‌ సెంచరీల సాయంతో 934 పరుగులు, టీ20ల్లో ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 249 పరుగులు సాధించాడు.భారత-ఏ జట్టుకు సారథిగా వ్యవహరించిన రాబిన్.. టీమ్‌ఇండియా తరఫున తన చివరి మ్యా్చ్‌ను 2015లో ఆడాడు

పాక్ పై హాఫ్ సెంచరీ చిరస్మరణీయ ఇన్నింగ్స్..

2007 టీ20 ప్రపంచకప్ లో యువకులతో కూడిన భారత జట్టులో సభ్యుడు. ఆటోర్నీ అసాంతం ఉతప్ప పలు మ్యాచ్లో కీలక ఇన్సింగ్స్ ఆడాడు.ముఖ్యంగా దాయాది పాక్ తో మ్యాచ్ లో కేవలం 39 బంతుల్లో 50 పరుగులు చేసి భారత విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఆమ్యాచ్ లో కీలక ఆటగాళ్లు పెవిలియన్ కి క్యూ కడుతున్న.. ఉతప్ప మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా ఆడిన తీరు హైలెట్. కాగా ఆమ్యాచ్ లో భారత్‌ తరఫున ఉతప్పదే అత్యధిక స్కోరు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అర్ధశతకం సాధించిన తొలి బ్యాటర్‌ గా రాబిన్‌ రికార్డు సృష్టించాడు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

sports: ఓటమిపై భావోద్వేగానికి గురైన వైభవ్ సూర్యవంశీ…

Ipl2026: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలై ఫైనల్ అవకాశాన్ని కోల్పోయిన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్...

Read out all

cricket:“నీ పోటీ ప్రపంచంతో కాదు— నిన్నటి నీతో”

Sports: క్రికెట్‌లో  కొన్ని ఇన్నింగ్స్‌లు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. కానీ సంకల్పంతో, సహనంతో, విమర్శల వర్షాన్ని తట్టుకుని ఆడిన ఇన్నింగ్స్‌లు మాత్రం అరుదు. టి20 ప్రపంచకప్ వేదికగా వెస్టిండీస్‌పై సంజూ...

Read out all

Sports: బంతి ఎగిరిన చోటు..!!

ఆర్. దిలీప్ రెడ్డి(సీనియర్ జర్నలిస్ట్): అది 1978. పదో తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు రావడానికి ఇంకా సమయముంది. హైదరాబాద్ వెళ్లి, వకీలుగా ఉన్న మా మేనమామ క్రిష్ణారెడ్డి ఇంట...

Read out all

National: Palash Muchhal–Smriti Mandhana Wedding Controversy…

Smriti Mandhana: A closer look at the unverified online rumours linking choreographer Nandika Dwivedi to the postponed wedding of Palash Muchhal and...

Read out all

cricket: King Charles III Interacts with Indian Cricketers During UK Tour…!!

Cricket: During their ongoing tour of England, the Indian men’s and women’s cricket teams were extended a special invitation by King Charles...

Read out all

Hyderabad:హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్..

Hyderabad: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA) – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మధ్య ఇటీవల చోటుచేసుకున్న టికెట్ల వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్...

Read out all
Optimized by Optimole