Music: బిందుమాలిని – ఓ సంగీత దర్శకురాలి ప్రస్థానం..!

సాయి వంశీ ( విశీ) :  2016లో తమిళంలో ‘అరువి’ అనే సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. టైటిల్ పాత్ర పోషించిన అదితి బాలన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. రజనీకాంత్ అంతటి నటుడు ఆమెకు ఫోన్ చేసి చాలా బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. తమిళం తెలియనివారు సైతం ఆ సినిమా వెతుక్కుని మరీ చూశారు. 2018లో కన్నడలో ‘నాతిచరామి’ సినిమా విడుదలైంది. శ్రుతి హరిహరన్, సంచారి విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించీ…

Read More

spiritualunion: ఓ మేలు కలయిక..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:  ‘ఇంతమంది మంచివాళ్లు …. ఒక చోట, ఒకే రోజు ఎలా కలిశారు?’ అని ఆశ్చర్యపోతూ అడిగారు ప్రొ.పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ (ఆదివారం) మమ్మల్ని అభినందిస్తూ! అది ఆయన మంచితనం. అయితే, అలా అని మేమేం మంచివాళ్లం కాదని కాదు సుమా! మేమంతా మంచోళ్లమే, మాదొక మేల్ కలయిక! ఆయన ప్రశ్నకు మా దగ్గర నిర్దుష్టంగా సమాధానం కూడా వుంది! అదేమంటే, రామోజీరావు గారి వల్ల అది సాధ్యమైంది. ప్రధాన స్రవంతి…

Read More

Poetry: నిన్నను క్షమించేద్దాం..!

Poetry:  నిన్నను క్షమించేద్దాం రేపటి రోజును నాశనం చేసే అవకాశాన్ని నిన్నకు ఇవ్వొద్దు. బాస రూపుమాసిపోతుంది. గొంతు ఊగిసలాడుతుంది. రాలిన ఆకుల చప్పుళ్లతో చెవులు గింగురుమంటుంటాయి. పొద్దు పొడిచే లోపే అవకాశానికి ఆటంకం ఎదురవుతుంది. నిన్నటి రోజును దాని మానాన గడచిపోనిద్దాం. కాలజాలంలోని కలనేతను కాసింత సడలించుదాం. రేపటి రోజును అదుపు చేయవద్దని నేటిని వేడుకుందాం. వెనుదిరిగి చూడనే చూడొద్దు. ఇక నిన్ను నడిపించేది నీ సంకల్పమే! — బాస్క్‌ మూలం: వీ ఫ్లమింగో స్వేచ్ఛానువాదం: పన్యాల…

Read More

Guppedamanasu: ప్రతి ఒక్కరిలో స్త్రీ ఉంటుంది..!

సాయి వంశీ ( విశీ) : శరత్‌బాబు గారు మరణించినప్పుడు అందరూ ‘సాగరసంగమం’, ‘సితార’, ‘అభినందన’, ‘సీతాకోకచిలుక’ లాంటి సినిమాల్లో ఆయన నటన గురించి ప్రస్తావించారు. ‘గుప్పెడు మనసు'(1979) గురించి ఎవరూ రాసినట్టు కనిపించలేదు. ఆ సినిమా గురించి చెప్పుకోకుండా ఆయన కెరీర్ గురించి చెప్పడం కష్టం. తెలుగులో వచ్చిన అతి విలువైన సినిమాల్లో అదీ ఒకటి. కె.బాలచందర్ గారి క్రియేషన్. కమర్షియల్లీ ఫ్లాప్. క్లాసికల్లీ హిట్. సుజాత, సరిత, శరత్‌బాబు.. ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలో…

Read More

Telugu literature: కుక్కతోక..!

Literature:  కుక్కతోక ‘నేను బాగా నాట్యమాడతాను’ కుక్కతో దాని తోక అంది. ‘మనం పోటీ పడదాం’ తోకకు సవాలు విసిరింది కుక్క. అలసిపోయిన కుక్క సహనం కోల్పోయింది. తోకను కొరికి అవతలకు ఉమ్మేసింది. ‘జాగ్రత్త! ఏమనుకున్నావో, ఏమో!’ గుర్రుమంటూ హెచ్చరించింది. — టిగ్రిన్యా మూలం: రీసమ్‌ హెయిలీ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More

Telugu literature: నేటి సాహిత్యం..వంకర నవ్వులు..!

Poetry :  వంకర నవ్వులు దొంతర దంతాలు ఒక దాని మీద ఒకటి వాలి ఉంటాయి- సందడి చేసే ప్రియురాళ్లలాగ. పలువరుసలోని దంతాలన్నీ ఒకే వరుసలో ఉండాలని నియమమేమీ లేదు. ఏదో మోజు కొద్ది జనాలు వంకర నవ్వులను సవరించుకోవడానికి పలువరుసలను చక్కదిద్దుకుంటూ ఉంటారు. — ఫేరోయీస్‌ మూలం: పాలా గార్డ్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More

Poetry: మూల్యం విలువ..!

Panyalajagannathdas:   మూల్యం.. ఏదీ ఆశించకుండా ఉండటం, దేనినీ జ్ఞాపకాల్లో దాచుకోకుండా ఉండటం, తిరిగి రావడానికి సొంత నేలనేది లేకుండా ఉండటం చాలా మంచిదని నాకు తెలుసు. అయితే, అలాంటి పరిస్థితుల్లో మనకు కవితలేవీ అర్థంకావు. నాకు బాగా తెలుసు నీలాంటి మంచి కవితలన్నిటికీ వాటి మూల్యం ఉంటుంది. మంచి కవితలన్నీ మన మనోవేదనను మూల్యంగా చెల్లించుకున్నాకే రూపు దిద్దుకుంటాయి. — ఆస్టురియన్‌ మూలం: జీ ఎం. సంచేజ్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More

Poetry: రాయడానికి ఒక చేయి చాలదు..!

Literature:  రాయడానికి ఒక చేయి చాలదు. ఈ రోజుల్లో రెండోది కూడా కావాలి. చెప్పలేని సంగతుల వంచనను చప్పున గ్రహించడానికి, వచ్చే ప్రళయం తర్వాత ఉదయించే తారక పేరును లిపిబద్ధం చేయడానికి, మోహవస్త్రంలోని వేలాది దారపు పోగుల అల్లిక తెగిపోకుండా చూడటానికి, వ్యర్థాల పోగు నుంచి మళ్లీ మొదలుపెట్టడానికి రెండో చేయి కూడా కావాలి. నిజానికి ఈ రోజుల్లో రాయడానికి రెండు చేతులూ చాలవు. కష్టాల తొక్కిడిలో నలిగిపోయి, ఈ నీచాతినీచ మరుభూమికి చేరుకోవలసిన అగత్యాన్ని రాయాలంటే,…

Read More

VIAGRA: ‘ వయాగ్రా ‘ కొన్ని అపోహలు – కొన్ని నిజాలు..

 విశీ(వి.సాయివంశీ) :  NOTE: ‘FBలో సెక్స్ సంబంధిత విషయాలు మాట్లాడటానికి మగవాళ్లు కూడా ఇబ్బంది పడతారు’ అని ఒక ప్రసిద్ధ కవి(?) నిన్న ఓ పోస్ట్ రాశాడు(దాని గురించి నా గత పోస్టులో రాశాను). అది అబద్ధం అని నిరూపించడానికి ఈ పోస్ట్ రాస్తున్నాను. సెక్స్‌కు అనుసంధానమైన బూతుల్ని విచ్చలవిడిగా వాడే మనం, సెక్స్ గురించి మాట్లాడటానికి సిగ్గు పడటం దరిద్రం. ఎక్కువ మాట్లాడకపోతే ఎక్కువ అపోహలు పుడుతూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేయడానికి నేనొక ప్రయత్నం…

Read More

Angered : ‘ కోపం ‘ అంతైతే ఎలా..?

దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ‘కోపం మంచిది’ అన్నవాళ్లు కనబడలేదు ఇంతవరకు. కోపాన్ని సంపూర్ణంగా జయించిన వాళ్లనూ నే చూడలేదు. కొంత మందికి ముక్కు మీదే కోపమైతే… మరికొందరు కోపాన్ని బాగా అణచుకోగలరు. కొందరు కోపం వచ్చినా, దాన్ని చాలా వరకు తమ అదుపాజ్ఞల్లో వుంచుకుంటారు. ఇంకొంత మంది, సదాచరణ ద్వారా తమకు ఎప్పుడూ కోపమే కలుగకుండా నడచుకోవడం అలవరచుకుంటారు, కొన్ని మినహాయింపులు తప్ప! ఇలాంటి వారు బహు తక్కువ!       చిన్న చిన్న…

Read More
Optimized by Optimole