జగన్ ని వణికిస్తోన్న లోకేశ్ పాదయాత్ర పాట..!

ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారం సొంతం చేసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తన అస్త్రాలకు పదును పెడుతోంది. యువగళం పాదయాత్ర ద్వారా లోకేశ్ ప్రజల్లోకి వెళుతున్నారు. దీనికి తోడుగా, వీలైనన్నీ ఎక్కువ దారుల్లో ప్రజల్లోకి చేరుకోవడానికి, జగన్ పాలనను ఎండగట్టడానికి ప్రయత్నాలు ఉధృతం చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినపడుతోన్న రవితేజ నటించిన ధమాకా సినిమాలోని జింతక పాటకు పేరడిగా లోకేశ్ పాదయాత్ర పాటను రూపొందించారు తెలుగుదేశం అభిమానులు. ’’జెండా పట్టబుద్ధాయితాంది… లోకేశో…. జై కొట్ట…

Read More

రాయ్ పూర్ వన్డేలో భారత్ ఘననిజయం..

రాయ్ పుర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా..గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ 40, ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. షమికి మ్యాన్ ఆఫ్ ది…

Read More

భారత పార్లమెంటు కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ గ్రేటేనా?

Nancharaiah merugumala: ================== “భారత పార్లమెంటు భవనానికి నూరేళ్లు నిండకుండానే కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ నిజంగా గ్రేటేనా?” బ్రిటిష్‌ ఇండియా సర్కారు 1927లో ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ (ఐఎల్సీ–కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్, సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ: కేంద్ర చట్టసభల ఎగువ దిగువ సభలు) కోసం నిర్మించిన భవనంలోనే 1947 ఆగస్ట్‌ 15 నుంచి భారత రాజ్యాంగ రచన పూర్తయ్యే వరకూ రాజ్యాంగ పరిషత్‌ సమావేశాలు జరిగాయి. భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించాక 1950 జనవరి నుంచి భారత…

Read More

పుష్య అమ‌వాస్య‌ విశిష్ట‌త..

పుష్య అమ‌వాస్య‌నే పౌష అమ‌వాస్య అని కూడా అంటారు. హైందవంలో పౌష అమ‌వాస్య‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంది. ఈమాసంలో పితృదేవ‌త‌ల‌కు దానం చేయడం వ‌ల‌న వైకుంఠ ప్రాప్తి క‌లుగుతుంద‌ని న‌మ్మ‌కం. ఈరోజున ఉప‌వాసం ఉండ‌టం వ‌ల‌న పితృదోషం, కాల‌స‌ర్ప దోషాల నుండి విముక్తి క‌లుగుతుంద‌ని పండితులు చెబుతారు. ఈరోజున సూర్య‌డిని ఆరాధించ‌డం వ‌ల‌న స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. జ్యోతిష్య ప్ర‌కారం ఇలా చేయాలి.. పౌష అమ‌వాస్య రోజున వేకువ జామునే స్నానం చేసి మందార పుష్పాల‌తో సూర్య…

Read More

ఏదైనా…కాలపరీక్షకు నిలిస్తేనే..!!

తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామాలు… ఈ వారం రెండు రాజకీయ శిబిరాల్లో శీతాకాలంలోనూ వేడి పుట్టించాయి. మొదటిది, ఢల్లీిలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ‘మిషన్‌ తెలంగాణ’ కేంద్రకంగా జరిగిన నిర్ణయాలైతే, రెండోది బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ తొలి రాజకీయ సభ! ఉద్యమం నుంచి రాజకీయాలకు మళ్లిన టీఆర్‌ఎస్‌ తన 23 ఏళ్ల ప్రస్తానంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా మారింది. ఆ క్రమంలో… పెద్ద సభావేదిక నుంచి, కేంద్రంలో…

Read More

‘జయ జయ జయ జయహే’ రివ్యూ..

Shanthi ishaan :  =========== ఆడదానికి కావల్సిందేంటి అని ఓ లేడీ జడ్జ్ కోర్టులో అడుగుతుంది. ఒకడు వినయం, విధేయత అంటాడు. ఇంకొకడు శాంతి, కరుణ, అదృష్టం అంటాడు. మరొకడు వంట బాగా చేయాలంటాడు. ఇంకో పెద్దాయన పిల్లల్ని కనడమంటాడు. అవేవీ కావు స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం అని చెప్పి ఆ జడ్జ్ అందరికీ అక్షింతలేస్తుంది. ఇంత పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు గానీ ఆడదానికి తనదైన ఉనికి, తన ఊపిరి మీద తనకే హక్కుందని చెప్పుకోగలిగే…

Read More

కివీస్ పై గిల్ ‘ ఉప్పెన ‘ ఇన్నింగ్స్..భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..!!

ఉప్పల్ వేదికగా కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు భారత యువ ఆశాకిరణం శుభ్ మన్ గిల్. ఫస్ట్ ఆఫ్ క్లాస్.. సెకండ్ ఆఫ్ మాస్ తరహలో హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయేలా చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్ లో వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లు పెవిలియన్ కి క్యూ కడుతున్న.. ఆత్మవిశ్వాసంతో డబుల్ సెంచరీ(208) బాదాడు. ఈ ఇన్నింగ్స్ తో వన్డేలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు అనేక రికార్డులను కొల్లగొట్టాడు. ఇక ఉత్కంఠగా బరితంగా…

Read More

జాతీయ పాలసీ లేని పార్టీకి.. ఆహా..ఓహో..

గత వారం రోజులుగా ప్రధాన తెలుగు ప్రతికలు, టెలివిజన్ ఛానళ్లలో  బిఆర్ఎస్ ఆవిర్భావ సభ పై ఒకటే ఊదరగొట్టే వార్తలు. ఆహా.. ఓహో..బ్రహ్మాండం బద్దలై పోతుంది.. ప్రధాని మోదీని పడగొట్టేందుకు.. మొనగాడు.. దేశ్ కీ నేత’..కేసిఆర్ సమర శంఖం పూరించబోతున్నాడు..అంటూ కారు పార్టీ నేతలు చేసినా హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా ఎందుకంటారా.. బిఆర్ఎస్ ఆవిర్భావ సభ కార్యక్రమం ఎలా సాగిందో చెప్పడానికి ఈ సోదంతా చెప్పాల్సి వచ్చింది.  అంతన్నాడు ఇంతన్నాడో గంగారాజు.. తరహాలో.. జాతీయ…

Read More

ఇంగిత జ్ఞానం లేదా..థూ… నీ బతుకు చెడ: బండి సంజయ్

తన కుమారుడి వీడియో ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే.. మొగోడైతే..కేసిఆర్  రాజకీయం తనతో చేయాలని సవాల్ విసిరారు. రాజకీయం చేయలేక..దద్దమ్మలా..కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా?అంటూ మండిపడ్డారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు?. తన కొడుకు తో పాటు ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం చేస్తావా?.. థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదని’  ఆగ్రహాంతో ఊగిపోయారు.చిన్న పిల్లలను…

Read More

ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం తథ్యం: ఎంపీ రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. 12నుంచి 14  శాతం కంటే ఎక్కువ మెజారిటీతో.. ఆ పార్టీకి లాభించే అవకాశం ఉందన్నారు. కుల, మతాలకతీతంగా అన్ని వర్గాలు  టిడిపికి దన్నుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన.. ఇటీవల తాను ప్రాంతాల వారిగా ఫ్లాష్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో టిడిపి కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని తేటతెల్లమయిందన్నారు. ఉత్తరాంధ్ర లో…

Read More
Optimized by Optimole