కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు: బండి సంజయ్
BJPTelangana:‘’14 వందల మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు….కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగుల కుటుంబాలకా? తెలంగాణ ఉద్యమ సమయంలో తిండికి లేక ముతక చొక్కాలేసుకుని తిరిగిన మీ కుటుంబానికి వేల కోట్లు ఎట్లా వచ్చినయ్. నీ దుర్మార్గపు పాలనలో తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్లెట్లా అయ్యారు’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనేందుకు గురువారం సంగారెడ్డి పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్…