ప్రజాస్వామ్యమా నీవెక్కడ?
ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ప్రజాస్వామ్యం చిన్నబోతోంది. ‘ఓస్ ఇంతేనా ప్రజాస్వామ్యమంటే!’ అనే అభిప్రాయం కలిగేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని అరిష్టాల నడుమ కూడా రాజరికమైనా, కడకు నియంతృత్వమైనా నయమేమో అనిపించేంత అద్వాన్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. 146 మంది విపక్ష సభ్యుల్ని సస్పెన్షన్‌తో బయటకు పంపి, దేశానికి కీలకమయ్యే చట్టాల బిల్లులను పార్లమెంటులో ప్రభుత్వం ఏకపక్షంగా ఓకే చేయించుకుంది. వాటిపై సమగ్ర పరిశీలన లేదు, అభ్యంతరాలు లేవు, చర్చ లేదు. నూటా యాబై సంవత్సరాలుగా…