మోదీ @ 20 ఏళ్లు ప్రముఖుల విశ్లేషణతో రూపొందించిన పుస్తకం..
ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని విభిన్న రంగాల ప్రముఖుల విశ్లేషణలతో రూపొందించిన ‘‘మోదీ @ 20 ఏళ్లు’’ పుస్తకాన్ని రాష్ట్రంలోని విద్యావేత్తలతోపాటు ప్రముఖులకు అందజేయాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం సాయంత్రం కరీంనగర్ హౌజింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ప్రిన్సిపాల్, రచయిత దాస్యం సేనాధిపతికి పుస్తక తొలి ప్రతిని అందజేశారు. తన పార్లమెంట్…
