పుష్ప చిత్రం నుంచి మూడో సాంగ్ రిలీజ్: చిత్ర యూనిట్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ క్రియెటివ్ జీనియస్ సుకుమార్ కలయికలో రాబోతున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో కన్నడ బ్యూటీ రష్మిక నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలని మూడో పాట ‘సామీ నా సామీ’ లిరికల్‌ వీడియోని గురువారం ఉదయం చిత్రబృందం సోషల్‌ మీడియాలో రీలిజ్ చేశారు. ఈ మాస్‌ సాంగ్‌ను మౌనికా యాదవ్‌ అలపించారు….

Read More

త్వరలో హర్ ఘర్ దస్తక్ పేరుతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ : కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో కోవిడ్ టీకాలు 100 కోట్ల మార్క్ ను దాటిన నేపథ్యంలో.. రాష్ట్రాల వారీగా టీకా వివరాలను సేకరించే పనిలో కేంద్రం నిమగ్నమైంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి మాండవీయ.. అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శలతో సమావేశం నిర్వహించారు. మరోవైపు దేశంలో దాదాపు 11 కోట్ల మంది కరోనా టీకా రెండో డోసు తీసుకోలేదని ప్రభుత్వ లెక్కల్లో వెల్లడైన నేపథ్యంలో.. హర్ ఘర్ దస్తక్ పేరుతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రతి ఇంటికి తిరిగి టీకాలు…

Read More

యాంటీబాడీలు పెరుగుతున్నాయి:ఆరో సెరోలాజికల్ సర్వే

దేశంలో కొవిడ్ వ్యాప్తి కొంత మేర తగ్గింది. అయితే, టీకాతో పాటు ప్ర‌జ‌ల్లో యాంటీబాడీలు కూడా పెరుగుతున్న‌ట్లు స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో చేప‌ట్టిన ఆరో సెరోలాజికల్ సర్వే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. స‌ర్వేలో భాగంగా పరీక్షించిన వారిలో 90 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. తాజా సెరో సర్వే సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించబడింది. ఇందులో మొత్తం 280 సివిక్‌ వార్డుల నుండి 28,000 రక్త నమూనాలను సేకరించారు….

Read More

దేశంలో మరోసారి పెరగనున్న వంట గ్యాస్ ధర..

దేశంలో నిత్యవసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడిపై ధరల భారం ఎక్కువవుతోంది. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు మరో చేదు వార్త వినాల్సి వస్తోంది. వంట గ్యాస్ ధరలను పెంచేందుకు చమురు సంస్థలు మరోసారి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి సిలిండర్‌పై ఏకంగా 100 రూపాయలు వరకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి సహజవాయు కంపెనీలు. అయితే దీపావళి పండుగకు ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా…

Read More

స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చమురు ధరలు సెంచరీ దాటాయి.కాగా హైద‌రాబాద్ న‌గ‌రంలో నెల రోజులు గ‌డ‌వ‌క‌ముందే లీట‌రు పెట్రోలుపై 6 రూపాయ‌ల‌కు మించి ధ‌ర పెర‌గ‌డం సామ‌న్యుల జీవితాల‌పై పెను భారంగా మారింది. కాగా హైద‌రాబాద్‌లో ఈ నెల 1వ తారీఖున 106 రూపాయ‌లున్న పెట్రోల్ ధ‌ర , అక్టోబ‌రు 28వ తారీఖుకు 112 రూపాయ‌ల 64 పైస‌ల‌కు చేరుకుంది. ఇక నిన్న‌టితో పోల్చుకుంటే న‌గ‌రంలో డీజిల్ ధ‌ర…

Read More

దేశంలో తగ్గిన పసిడి ధర..

పండుగ సీజ‌న్‌లో ప్ర‌జ‌ల‌కు బంగారంలాంటి వార్త అందింది. గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరుగుతూ పోయిన పసిడి ధరలు గురువారం తగ్గాయి. ఈ రోజు మాత్రం త‌గ్గిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 130 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 130 రూపాయ‌లుగా ఉంది. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం…

Read More

పండుగ సీజన్‌ నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్..

పండుగ సీజన్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థం భారతీయ రైల్వే దాదాపు 668 పండుగ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. దేశ‌వ్యాప్తంగా వివిధ రైల్వే సెక్టార్ల ప్ర‌ధాన గ‌మ్య‌స్థానాలు క‌నెక్ట్ అయ్యే విధంగా ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్లాన్ చేశారు. కాగా ప్ర‌త్యేక రైళ్ల‌తో పాటు రెగ్యుల‌ర్ రైళ్ల‌కు అద‌నపు కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక పండుగ ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని నిర్వ‌హ‌ణా సిబ్బందిని కూడా పెంచ‌బోతున్నాట్లు రైల్వే మంత్రిత్వ శాఖ‌ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించింది.

Read More

పెగాసస్ పై విచారణకు ప్రత్యేక కమిటీ_ సుప్రీం

దేశంలో పెగాసస్‌ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. పెగాసస్‌ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమిస్తున్న‌ట్లు తెలిపింది.చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన స‌రికాద‌ని, ఈ విష‌యాన్ని కోర్టు సహించదని స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్‌ ప్రత్యక్ష…

Read More

హుజరాబాద్లో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ..

హుజూరాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో కొన్ని గంట‌ల్లో ముగియ‌నుండ‌గా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఓట‌ర్ల‌ని ఆక‌ర్షించే ప‌నిలో చివ‌రి ఘ‌ట్టానికి చేరుకున్నాయి. అందులో భాగంగా బిజేపి మ్యానిఫెస్టో విడుద‌ల చేసింది. కాగా స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్‌… స‌బ్ కా విశ్వాస్‌, స‌బ్ కా ప్ర‌యాస్‌… అనే ప్ర‌ధాని మోడీ నినాదం స్ఫూర్తితో హుజూరాబాద్‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమానికీ, అభివృద్ధికీ కృషి చేస్తామ‌ని రాష్ట్ర బిజెపి మ్యానిఫెస్టోను విడుద‌ల చేసింది. ఇందులో పొందు ప‌రిచిన…

Read More

దేశంలో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..

దేశంలో బంగారం ధ‌రలు ప‌లుచోట్ల పెరిగిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్‌లో స్వ‌ల్పంగా తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరిగింద‌నే చెప్పాలి. ఇక బుధవారం బంగారం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు 47 వేల 270 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 270. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు గ‌మ‌నిస్తే, చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 380…

Read More
Optimized by Optimole