బీజేపీలోకి మరో కాంగ్రెస్ నేత!

తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన మోహన్ రావు పాటిల్ భోస్లే, ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బుధవారం బిజెపిలో చేరారు. ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, ఎన్.రాంచందర్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనపై నమ్మకంతో చాలామంది పార్టీలో చేరుతున్నారని.. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా చాలామంది పార్టీలో చేరుతారని అన్నారు….

Read More

వైఎస్ షర్మిల పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత!

తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నా వైఎస్‌ షర్మిల, తాను పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లు షర్మిల బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె లోటస్‌పాండ్‌లో ఖమ్మం జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. నా తండ్రీ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో తమ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరంటూ ఆమె స్పష్టంచేశారు. మరో వైపు…

Read More

సీజేేఐ గా జస్టిస్ ఎన్వీ రమణ..?

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరును, సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన  కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. రూల్స్ ప్రకారం ప్రకారం ఈ లేఖను మొదట  ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపుతారు. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుతుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక కావడం జరుగుతుంది.  ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ…

Read More

కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది : విజయశాంతి

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. రాష్ట్రంలో ఏపని తలపెట్టిన అరకొరగానే ఉంటుందనడానికి  కరోనా కట్టడి చర్యలే నిదర్శనమని అన్నారు. సూర్యాపేటలో సోమవారం జరిగిన కబడ్డీ పోటీల ప్రమాదాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. నిర్వహణ లోపంతో పాటు అక్కడ కోవిడ్ నియంత్రణ చర్యలేవీ చేపట్టలేదని.. గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యారని అన్నారు. అధికారులకు సరైన మార్గదర్శకాలు జారీ చేయడంలో రాష్ట్ర…

Read More

దీదీని ప్ర‌జ‌లు క్ష‌మించరు : ప్ర‌ధాని మోదీ

వందేమాత‌రం గేయంతో యావ‌త్ భార‌తావనిని బెంగాల్ క‌ట్టిప‌డేసిందని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. అలాంటి బెంగాల్‌లో దీదీ బ‌య‌టివ్య‌క్తుల అనే మాట‌లు మాట్లాడ‌టం భావ్యం కాద‌ని మోదీ ధ్వ‌జ‌మెత్తారు. బుధ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గోన్న ఆయ‌న మాట్లాడుతూ .. సుభాష్ చంద్రబోస్ , బంకీఛంద్ర చ‌ట‌ర్జీ, ర‌వీంద్ర‌నాథ్ ఠాగుర్ వంటి మ‌హ‌నీయులు పుట్టిన నేల బెంగాల్ అని కొనియాడారు. భార‌త్‌లో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రు భర‌తమాత బిడ్డ‌ల‌ని మోదీ స్ప‌ష్టం చేశారు. మ‌మ్మ‌ల్ని బ‌య‌టివారిగా సంభోదిస్తూ మ‌మ‌తా…

Read More

విద్యా సంస్థలకు తాత్కాలిక సెలవు : విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు తాత్కాలిక సెలవు ప్రకటిస్తున్నట్లు  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆమె ప్రకటన చేశారు. ‘‘దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో  కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదీ ఇలాగే కొనసాగితే కరోనా…

Read More

తొలి వ‌న్డేలో భార‌త్ విజ‌యం!

ఇంగ్లాడ్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీంఇండియా బోణి కొట్టింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో అధిప‌త్యాన్ని ప్ర‌ద‌రిస్తూ కోహ్లీసేన 65 ప‌రుగుల తేడాతో ఇంగ్లాడ్‌ను మ‌ట్టిక‌రిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్‌కు ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న (98 : 108 బంతుల్లో 11*4,2*6), కోహ్లీ (56 : 60 బంతుల్లో 6*4) బ్యాటింగ్‌కు తోడు, కేఎల్ రాహుల్ (62 నాటౌట్ : 43బంతుల్లో 6*4, 4*4), కృనాల్ పాండ్యా (58 నాటౌట్ : 31…

Read More

కోవిడ్ తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు!

దేశంలో మ‌లిద‌శ క‌రోనా ఉదృతి వేళ కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న‌ ప్రాంతాల‌ను గుర్తించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టి సారించాల‌ని ఆదేశించింది. ప్రతి ఒక్క‌రు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు .. – అన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీపీసిఆర్ ప‌రీక్ష‌లు పెంచాలి. – కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి కంటెన్మెంట్ జోన్‌ల‌ను ప్ర‌క‌టించాలి. – ర‌ద్దీ ప్రాంతాల్లో ప్ర‌తి ఒక్క‌రు కోవిడ్…

Read More

ఉత్త‌ర‌ఖాండ్ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్!

ఉత్త‌ర‌ఖాండ్ ముఖ్య‌మంత్రి తిర‌త్‌సింగ్ రావ‌త్కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. గ‌త వారం రోజులుగా నాతో స‌న్నిహితంగా మెలిగిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. ద‌యచేసి ప్ర‌జ‌లంద‌రు అప్ర‌మ‌త్తంగా ఉండండి అని పేర్కొన్నారు. కాగా ఆయ‌న మంగ‌ళ‌వారం ప్ర‌ధాని మోదీ , హోంమంత్రి అమిత్ షాతో స‌మావేశం కావాల్సి ఉండ‌గా, భేటిని ర‌ద్దు చేశారు.

Read More

సీఎం పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింది : బండి సంజ‌య్

సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింద‌ని భాజాపా అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేర్కొన్నారు. ఉద్యోగుల‌కు క‌నీసం 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని సంజ‌య్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం ఓప్ర‌క‌ట‌న విడుదల చేశారు. భాజాపా కార్య‌కర్తల ఒత్తిడి మేర‌కే ముఖ్య‌మంత్రి పీఆర్సీ ప్ర‌క‌ట‌న చేశార‌ని తెలిపారు. పెంచిన వేతనాల్ని గ‌త ఏడాది నుంచి మాత్ర‌మే ఇస్తామ‌న‌డం కేసీఆర్ వైఖ‌రికి నిద‌ర్శ‌మ‌ని అన్నారు. ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌సు పెంపుతో ఉద్యోగాల నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోతే రాష్ట్ర…

Read More
Optimized by Optimole