భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా…. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు..!
Bandisanjay: రిజర్వేషన్ల రద్దుపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు సవాల్ చేస్తున్నా…. ‘‘మేం ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను రద్దు చేయబోమని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఇక్కడున్న ప్రజలంతా దేవుడిమీద ప్రమాణం చేసి రిజర్వేషన్లు రద్దు కావని చెబుతున్నారు. మరి ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని భగవంతుడి మీద ప్రమాణం చేసే దమ్ముందా కాంగ్రెస్ నేతలకు’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో నిర్వహించిన…