Telangana: బిఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుందా..?

Telanganacongress: ఎన్నికలు ముగియగానే ప్రతీ రాజకీయ పార్టీ ప్రధానంగా అధికారం చేపట్టినవారు ‘‘రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. ఇక పై అభివృద్ధిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తాం…’’ అంటూ తియ్యటి మాటలను వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యతిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పరిపాలనతో సంతృప్తి చెందని ప్రజలు ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు మించి పార్లమెంట్‌ ఎన్నికల్లో గట్టి గుణపాఠం…

Read More

Telanganaslang: తెలంగాణ వాళ్లం.. మేం అంత Unculturedఆ..?

సాయి వంశీ ( విశీ) :  హీరో విజయ్ దేవరకొండని తన యాస మార్చుకొమ్మని ఓ వీడియో చేశారని, ఆ వీడియోను ఖండిస్తూ Mohan Babu ఒక‌ పోస్ట్ రాశారు. ఆ వీడియో చేసినవాళ్లు కొన్ని సినిమాలకు ఆ యాస సరికాదని అన్నారా? లేక పూర్తిగా ఆ యాసను వదిలేయమని ఉచిత సలహా ఇచ్చారా అనేది తెలియదు. కొన్ని సినిమాలకు ఆ యాస కరెక్ట్ కాదని నేనూ ఒప్పుకుంటాను. ఒక యాక్టర్ అన్ని పాత్రల్లో ఒకే రకమైన…

Read More
bjp telangana,bjp,

BjpTelangana: తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పోరు.. పాత కొత్త కలహాలు..!

BjpTelangana:  ‘‘మంచి నాయకుడికి సహనం అనే గుణం ఉండాలి. ఎదగాలనుకునే నాయకుడు ఓపిక పడితే కచ్చితంగా కష్టానికి తగిన ఫలం పొందుతాడు..’’ అనే చాణక్య రాజనీతి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. లోక్సభ ఎన్నికలు అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో నాయకుల మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అధ్యక్ష పదవి పోరులో నాయకులు సహనం కోల్పోయి చేస్తున్న వ్యాఖ్యలతో నష్టం జరుగుతున్నా బీజేపీ అధిష్టానం…

Read More

Indianconstitution: భారత రాజ్యాంగాన్ని ఇందిరమ్మ 1977లో గుర్తుచేస్తే..ఇప్పుడు మోదీ ఆ పని చేస్తున్నారు!

Nancharaiah merugumala senior journalist: “భారత రాజ్యాంగాన్ని మొదట ఇందిరమ్మ 1977లో గుర్తుచేస్తే..ఇప్పుడు మోదీ ఆ పని చేస్తున్నారు! “ ఇందిరా గాంధీ 11 సంవత్సరాల పాలన తర్వాత, 21 నెలల (కొందరు 19 మాసాలని లెక్కిస్తారు) ఎమర్జెన్సీ అనంతరం…1977 మార్చ్ నెలలో నాటి ప్రతిపక్ష పార్టీలకు భారత రాజ్యాంగం, అందులోని ప్రాథమిక హక్కుల విలువ ఏమిటో అర్థమైంది. ఇందిరమ్మ పార్టీ నేత కాకపోయినా.. అమె అడుగుజాడలనే ఆదర్శంగా ఎంచుకున్న నరేంద్ర మోదీ దశాబ్ద పరిపాలన అనంతరం…

Read More

APpolitics: ఏపీ రాజకీయం..‘‘ఎవరనుకున్నారు…ఇట్లయితదని..?’’

APpolitics:   దివంగత నేత రాజీవ్ గాంధీ నేతృత్వంలో 1984లో జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 400 సీట్లు వచ్చినప్పుడు… ‘‘నాలుగొందల సీట్లు వచ్చాయని, ఆయన గాలి పీల్చద్దంటే పీల్చకుండా ఉండాలా?’’ అని ప్రజాకవి కాళోజీ అనేక సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రశ్నను సంధించేవారు. ప్రజాకవి కాళోజీ అన్న ఈ మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సరిగ్గా సరిపోతాయి. వ్యవస్థలను నాశనం చేసి, ప్రజల ఆకాంక్షల్ని లెక్కచేయకుండా ఏకపక్ష పాలన చేసినందుకే జగన్ ను వద్దనుకుని…

Read More

Bandisanjay: ఒకే ఫ్రేంలో ” మాస్ ” హీరోలు..!

Bandisanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కొద్దిసేపటి క్రితం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి తన నివాసానికి తోడ్కోని వెళ్లారు. శాలువా కప్పి సత్కరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.  ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ..‘‘సంజయ్ గారు… మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు. మీరు మంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అగ్రెసివ్ మెంటాలిటికి తగిన పోస్ట్…

Read More
జీవన్రెడ్డి,jeevanreddy,mlc,

Telangana: పోచారం చేరిక అవకాశవాదానికి నిదర్శనం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Telanganacongress:  తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌పై ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యే స‌భ్యుల‌తో సుస్థిర ప్ర‌భుత్వం ఉంద‌ని.. ఇత‌ర పార్టీ నేత‌ల‌ను చేర్చుకోవాల్సిన అవ‌స‌రమేముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏ రాజ‌కీయ పార్టీ అయినా సిద్ధాంంతాల‌కు అనుగుణంగా పోరాటం, ప‌ని చేయాల‌ని హితువు ప‌లికారు. దీంతో పార్టీ ఫిరాంపుల‌పై జీవ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్ హ‌స్తంపార్టీలో కొత్త చ‌ర్చ‌కు దారితీసింది. ఇక తాజాగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో…

Read More

Chandrababu: చంద్రబాబుకు లోక‌స‌త్తా బాబ్జి లేఖ.. రైతుల ఖాతాల్లో 20 వేలు జమ చేయండి..!

APpolitics:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘ఏరువాక’ సందర్భంగా లోకసత్తా పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి లేఖాస్త్రం సంధించారు.తెలుగుదేశం – జనసేన పార్టీ ఉమ్మడిగా విడుదల చేసిన ప్రజాగళం మ్యానిఫెస్టోలోని సూపర్సిక్స్ హామీల్లో ప్రస్తావించినట్లుగా .. రాష్ట్రంలో రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం జమచేయాలని రైతాంగం పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం సీజన్ ప్రారంభం అయ్యిందని..గత ఖరీఫ్, రబీ సీజన్లో వర్షాభావంతో ఒకవైపు కరువు, మరోవైపు డిసెంబర్…

Read More

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More

APpolitics: ‘‘బాబే మారెనా…? ప్రజలనేమారెనా??’’

APpolitics:  ‘మారింది మారింది కాలం…. మారింది మారింది లోకం… ఎక్కడ మారిందమ్మా…? ఇంకా దిగజారిందమ్మా…..!’ అనే సినీ గీతమొకటి  డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసింది తెలుగునాట బాగా ప్రసిద్ది. తాను మారానని, మారిన మనిషినని చంద్రబాబునాయుడు ఇటీవల పదే పదే చెబుతున్నారు. బాబు నిజంగా మారారా? నమ్మడానికి మన మనసు అంత తేలిగ్గా అంగీకరించదు. ఎందుకంటే, ఇది ఆయన కన్నా, ఇతరులు చెబితేనే నమ్మాలి. కానీ, ఇప్పటివరకు ఇతరులెవరూ ఆ ముక్క చెప్పట్లేదు. ఆయనే చెబుతున్నారు. ‘మారిన చంద్రబాబును…

Read More
Optimized by Optimole