సీఎం సన్నిహిత సంస్థ ఇండోసోల్ కంపెనీకి వేల ఎకరాల భూ సంతర్పణ: నాదెండ్ల
APpolitics: ‘అడ్డగోలు వ్యవహారాలు… అడ్డదిడ్డమైన నిర్ణయాలతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలు విస్తుగొలిపేలా ఉన్నాయన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రజాధనాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తన అనుకున్న కంపెనీలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి బరి తెగించారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ కంపెనీకి చేసిన భూ కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. చట్టాలను, నిబంధనలను గాలికొదిలేసి మరీ ఆ కంపెనీకు లబ్ధి చేకూర్చడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందన్నారు. కేవలం…
