కృష్ణా కమ్మలను…కడప రెడ్లను మాజీ ఎంపీ కంగారు పెడుతున్నారా?

Nancharaiah merugumala(senior journalist) ……………………………………………….. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారు పేరు చెప్పగానే… కృష్ణా జిల్లా కమ్మ కుటుంబ మూలాలున్న మీడియా వ్యాపారి చెరుకూరి రామోజీరావు గారు రంగారెడ్డి జిల్లా అనాజ్‌ పూర్‌ గ్రామంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కంగారు పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం వైఎస్సార్సీపీ ఎందుకో మరి ఉండవల్లి గారి సూటిపోటి తాజా మాటలకు జవాబు చెప్పాలని భావించింది. అంటే, కృష్ణా జిల్లా కమ్మలే కాదు, కడప…

Read More

గుజరాత్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. కలిసొచ్చిన మోదీ బ్రాండ్..!!

గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్ర తిరగరాసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో.. ఎగ్జిట్  పోల్స్  అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో కనీవినీ రీతిలో 156 సీట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. మోదీ హావాతో  ప్రతిపక్ష పార్టీలకు పట్టున్న నియోజక వర్గాల్లోనూ కమలం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ  ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తమకు పట్టున్న నియోజక వర్గాలతో…

Read More

తెలంగాణ బ్రాహ్మణ బిడ్డకి గుజరాతీ నేతలే న్యాయం చేయాలి!

Nancharaiah merugumala: _____________________________ బాబరీ మసీదును కూల్చి 30  ఏళ్లు నిండుతున్నా పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వరా? ‘వివాదాస్పద కట్టడం’ బాబరీ మసీదును అయోధ్యలో కూల్చేసి నేటికి 30 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్న పాములపర్తి వేంకట (పీవీ) నరసింహారావు గారు తనమౌనముద్రతో, ఉదాశీన వైఖరితో మసీదు కూల్చివేతకు దోహదం చేశారు. రాజధాని దిల్లీ నుంచే తన పరోక్ష తోడ్పాటును మిత్రుడు, బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజపేయి గారికి అందించారు. పీవీ…

Read More

విశాఖపట్నం నోవాటెల్‌ లో పవన్‌ కల్యాణ్.. హైదరాబాద్‌ కారులో షర్మిల!

Nancharaiah merugumala: ======================= ఇద్దరూ బందీలేగాని వారి ప్రతిఘటన తీరులోనే కొట్టొచ్చే తేడా! కిందటి నెల అక్టోబర్‌ మూడో వారంలో విశాఖపట్నంలో పార్టీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు జనసేన పార్టీ నేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం, ప్రభుత్వం పకడ్బందీ పథకంతో పవర్‌ స్టార్‌ను ఫైవ్‌ స్టార్‌ హోటెల్‌ నోవాటెల్‌ స్వీట్‌ (గది) నుంచి బయటకు రాకుండా రెండ్రోజులు బందీగా ఉంచగలిగాయి. పైకి దూకుడుగా ఉద్యమిస్తారనే పేరున్న జనసేన కార్యకర్తలు గాని, ఏపీ ప్రభుత్వంపై…

Read More

తూర్పు, మున్నూరు కాపులను ఉద్ధరించే స్థితిలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం ఉందా?

Nancharaiah merugumala: ______________________ తూర్పు, మున్నూరు కాపులకు.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం దారి చూపగలదా? ………………………………………………………………………… ఆంధ్రప్రదేశ్‌ లో బీసీ హోదా ఉన్న తూర్పు కాపులకు శనివారం అమరావతిలో ‘దిశానిర్దేశం’ చేశారు జనసేన పార్టీ నేత, కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయానికి చెందిన కొణిదెల పవన్‌ కల్యాణ్‌. కా–బ–తె–ఒం కులాలు తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని ఎంతో కాలంగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. తమ లక్ష్య సాధనకు ఇప్పటికే బీసీ–డీ గ్రూపులో ఉన్న ఉత్తరాంధ్ర…

Read More

తాండూరు కాంగ్రెస్ కు ఆశాకిరణంలా కనిపిస్తున్న నేత..!!

తాండూర్ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత..సరైన నాయకత్వంలేక డీలాపడిన కాంగ్రెస్  శ్రేణులకు నేనున్నాంటూ భరోసా కల్పిస్తూ ఆశాకిరణంలా దూసుకొచ్చాడు పట్లోళ్ల రఘువీరారెడ్డి. ఎన్నికల్లో వరుస ఓటములు..అంతర్గత కలహాలతో సతమతమవుతున్న నేతల్ని ఏకతాటిపైకి తెచ్చి పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు.అసలు ఉన్నట్టుండి రేస్ లోకి దూసుకొచ్చిన  రఘువీరారెడ్డి రాజకీయ  నేపథ్యం ఏంటి? వచ్చే ఎన్నికల్లో రాజకీయ ఉద్ధండులను తట్టుకుని నిలిచి గెలిచే సత్తా అతనిలో…

Read More

వైఎస్ ‘ఆత్మ’ కొత్తపాచిక పారేనా..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇన్నాళ్లు వ్యూహాత్మకంగా మౌనం వహించిన వైఎస్ ఆత్మ డాక్టర్ కేవిపీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.తన ముఖ్య అనుచరడు గిడుగు రుద్రరాజును  ఏపీసీసీ పీఠంపై కూర్చొబెట్టారు.ఏపీ లో రాజకీయ చాణిక్యుడిగా  పేరొందిన కేవీపీ యాక్టివ్ అవడంతో   .. రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. కాగా నూతన పరిణామాలతో ..పాత కాంగ్రెస్ నాయకులు..రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరులు..మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా కింద పునరేకీకృతమయ్యే  సూచనలు కనిపిస్తున్నాయి.వైఎస్ఆర్ …

Read More

విద్యాదాత మల్లన్నకే ఇన్ని కష్టాలు.. బక్కరెడ్లు, బడుగు రెడ్లు ఎలా బతకాలి?

Nancharaiah merugumala:  ……………………………………………….. కొన్ని దశాబ్దాల క్రితం బర్రెలను మేపుతూ, పేడ ఎత్తుకుంటూ, పాలు పితికారు తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి చామకూర మల్లా రెడ్డి. తనలాగే పాలూ, పెరుగు అమ్ముకునే దోస్తు దుర్గయ్య యాదవ్ తో కలిసి మొదట బోయినపల్లిలో చదువుల వ్యాపారం లోకి దిగారు. క్రైస్తవులు నడపలేకపోతున్న హై స్కూలును కొని గాడిలో పెట్టారు. తరవాత ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టి నాలుగు రాళ్లు కూడబెట్టారు. తెలుగు పాత్రికేయులు సహా తనకు సాయపడిన సామాన్యులందరినీ…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌కు జ్ఞానోదయమెప్పుడు..?

తప్పులు దొర్లడం సహజం. జరిగిన తప్పిదాలను మరోసారి జరుగకుండా.. చూసుకుంటు ముందుకు సాగడం ఆనవాయితీ. కాని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న తప్పిదాలను అధిష్ఠానం గుర్తించలేక పోతుందా..? లేదా తెలిసి ఊరుకుంటుందా..? అనే సందేహాలు అందరిని ఆలోచనల్లో పడేశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. తెలంగాణలో ప్రజలకు చేసిన మేలుకు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను కొత్త రాష్ట్రంలో…

Read More

జర్నలిస్ట్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఎవరిదో?

తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రముఖ తెలుగు చానెల్స్ కి చెందిన సీనియర్ మహిళా రిపోర్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎన్టీవీకి చెందిన సీనియర్ రిపోర్టర్ రెహానా ఈ పోటీలో ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. టీవీ 9 సీనియర్ రిపోర్టర్ హసీనా కూడా తన మార్గంలో, వైఎస్సార్ సీపీ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు..ఉన్నతాధికారుల ఆశీస్సులతో తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తోంది. గవర్నర్…

Read More
Optimized by Optimole