ఫలితాలు అన్ని పార్టీలకు మును(పటి)గోడే…!!

దేశంలోనే అత్యంత ఖరీదైన మునుగోడు ఉప ఎన్నికల హడావుడి ముగియడంతో ఇప్పుడు రాష్ట్రంలో భవిష్యత్‌ రాజకీయాలపై చర్చలు మొదలయ్యాయి. మునుగోడు ఎన్నికల ఫలితాల ప్రభావంతో రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలకు మునుగోడు బలమైన నియోజకవర్గం. 2018 సాధారణ ఎన్నికల్లో 12 వేల ఓట్లు మాత్రమే సాధించిన బిజెపి బలం నామమాత్రమే అయినా ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వ్యక్తిగతంగా పట్టు ఉంది. 2014లో…

Read More

తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత VS ఎంపీ అర్వింద్ ..

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దీంతో విమర్శలు , ప్రతివిమర్శల మాటల దాటి ఇళ్లపై దాడులు చేసే వరకు వెళ్లింది. అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా ..కవిత అనుచరులు అతని ఇంటిపై దాడి చేయగా..పిచ్చివాగుడు వాగితే చెప్పు దెబ్బలు తప్పవని ఆమె వార్నింగ్ ఇచ్చింది. అటు అర్వింద్ సైతం దాడిపై ఫైర్ అయ్యారు.తాను ఇంట్లో లేనప్పడు .. టీఆర్ఎస్…

Read More

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు.. టిఆర్ఎస్ టికెట్ కోసమేనంటూ..?

తెలంగాణాలో కొందరి అధికారుల తీరు పై సర్వత్రా విమర్శల వెల్లువెత్తుతున్నాయి. స్వార్థ రాజకీయాల కోసం తమ హోదాలను మరిచి ప్రభుత్వ ఉన్నతాధికారులు  ప్రవర్తిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. తాజాగా  తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వైఖరే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది.  ఇంతకు ఈ చర్చ ఎందుకు తెరమీదకు వచ్చింది. దీని వెనక దాగున్న కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఇక రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది….

Read More

తెలంగాణలో కమల వికాసం తథ్యమన్న మోదీ.. జోష్ లో కమలదళం.. !!

  తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కమల దళంలో నూతనోత్సహన్ని నింపింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిన గెలిచనంత పనిచేసిన కార్యకర్తలకు బూస్టప్ ఇచ్చేలా ప్రసగంతో స్పూర్తినింపారు మోదీ. గతంలో ఎన్నడూ లేని విధంగా తనదైన శైలిలీ చమత్కార పంచులతో వినోదాన్ని పంచారు.అదే తరహాలో అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ .. పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.తెలంగాణ ప్రజలను దోచుకున్న అవినీతి పరులను వదిలి పెట్టే ప్రసక్త లేదని మోదీ అల్టిమేటం జారీచేశారు.కుటుంబ పాలనకు అంతమొందించే సమయం…

Read More

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళిపై పేరడీ..

మునుగోడు ఉప ఎన్నిక యుద్ధం ముగిసింది. హోరా హోరీ పోరులో చావు తప్పి కన్ను లొట్ట పడ్డట్టు అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రధాన ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్ధి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీంతో రాష్ట్రంలో నెలరోజుల ఉత్కంఠకు తెరపడింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పై సోషల్ మీడియా.. ప్రధాన మీడియాల్లో విశ్లేషకులు పుంకాలు పుంకాలు వ్యాసాలు దంచికొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యం దేశంలో ఎన్నికల తతంగాన్ని.. స్టూడెంట్.. ప్రొఫెసర్…

Read More

ఓపెన్ కేటగిరీ రద్దుచేసి, దాని స్థానంలో 50 శాతం EWS కోటా పెడితే మేలేమో!

Nancharaiah Merugumala : ————————– ———- ———-// పది శాతం అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటా రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు 3-2 మెజారిటీ తీర్పు ఇచ్చిన తర్వాత ఇండియాలో రిజర్వేషన్ల వాటాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో ఓపెన్ కాంపిటీషన్ లేదా ఓపెన్ కేటగిరీ (OC) లేదా జనరల్ కేటగిరీని రద్దుచేయాలి. ఈ ఓపీ లేదా ఓసీ కేటగిరీని రద్దు చేసి కూర్చోకూడదు. EWS కోటాను 10 శాతం…

Read More

బ్రాహ్మణ, వైశ్య కులాలకు ‘అభినవ అంబేడ్కర్‌’ నరేంద్ర మోదీ!

Nancharaiah Merugumala:  అగ్రవర్ణ పేదల కోటా అనుకూల తీర్పును వ్యతిరేకించిన ఇద్దరు జడ్జీలూ బ్రాహ్మణులే! ……………………………………………………………………………………………. చారిత్రకంగా కొనసాగిన సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా అమలు చేస్తున్న రిజర్వేషన్లు పేదరికం ప్రాతిపదికగా ‘అగ్రవర్ణాలు లేదా అగ్రకులాలకు’ ఇచ్చినా చెల్లుబాటు అవుతాయని ఈరోజు సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన అనుసూచిత కులాలు (ఎస్సీలు), అనుసూచిత జాతులకు (ఎస్టీలు లేదా ఆదివాసీలు) కల్పిస్తున్న రిజర్వేషన్లు లేదా కోటాలు– పేదరిక నిర్మూలన కార్యక్రమాలుగా పరిగణించరాదని గతంలో ఇచ్చిన…

Read More

ఎవరి అభివృద్ధి కోసం మునుగోడు ఉప ఎన్నిక..?

ఓటరు మహశయులారా..! ఎవరు అవునన్నా..కాధన్నా..ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నికలు రాజ్యాంగ వ్యవస్థ కు లోబడి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిందే.ప్రజల ఆకాంక్షలు,విశ్వాసాల మేరకే నియమిత కాలానికి ప్రభుత్వాలు ఏర్పడతాయి.రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.మీరు ఎన్నుకున్నవారు  సరిగా పనిచేయడం లేదని బావించినప్పుడు మీదే  అంతిమ నిర్ణయాధికారం.శాసన కర్తల అంతిమ లక్ష్యం సుపరిపాలన.అనాటి కాలంలోనే అరిస్టాటిల్”వ్యక్తుల పాలన కన్నా చట్టాల పాలన శ్రేష్టమైనది” అని చెప్పారు.కాబట్టి ప్రభుత్వాల ఏర్పాటు, ఎన్నికలు,నిర్మాణం,నిర్వాహణ అంతిమ లక్ష్యం “ప్రజా విశ్వాసం”…

Read More

కేసీఆర్ హామీలపై బీజేపీ ‘ఝూఠా మాటల పోస్టర్ల’ అస్త్రం.. రెచ్చిపోతున్న నెటిజన్స్..!!

సీఎం కేసిఆర్ పై తెలంగాణ బీజేపీ మరో అస్రాన్ని సంధించింది. వివిధ సభల్లో సందర్భానుసారం కేసిఆర్ ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్రశాఖ ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లను రూపొందించింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. కేసీఆర్‌ ఝూఠా మాటలు పోస్టర్లను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని బిజెపి శ్రేణులను ఆయన కోరారు. ఇక ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లనూ పరిశీలించినట్లయితే.. ”…

Read More

ఉపఎన్నికలోనైనా తెలంగాణ బీసీ ‘గీతలకు, నేతలకు’ గిరాకీ పెరుగుతోంది, సంతోషం..!!

Nancharaiah merugumala: ………………………………………………… బక్క రెడ్ల కన్నా బలిసిన రెడ్లు ఎక్కువ మంది కనిపించే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి వంటి తెలంగాణ జిల్లాల తీరే వేరు. తెలంగాణ రాష్ట్రం పుట్టినాక తెలంగాణ లో రెడ్డి కుటుంబాల్లో పుట్టిన శాసనసభ సభ్యుల సంఖ్య పెరిగింది. ముఖ్యమంత్రి ఒక శాతం కూడా లేని పద్మనాయక వెలమ కులానికి చెందిన కె.చంద్రశేఖరరావు కావడంతో రెడ్డీలు లేదా రెడ్లకు రాజకీయంగా ప్రాధాన్యం వారి జనాభా నిష్పత్తి…

Read More
Optimized by Optimole