కాంగ్రెస్ కుటుంబానికి బోఫోర్స్‌..ప్ర‌ధానికి గుజరాత్‌ అల్లర్లు–భూతాల్లా వెంటాడతాయి!

Nancharaiah Merugumala:(senior journalist) ……………………………………………………………………………… దేశంలో అవినీతి విషయంలో గుత్తాధిపత్యం కాంగ్రెస్‌ పార్టీది. హిందూ మతోన్మాదాన్ని ఎన్నికల్లో వాడుకోవడం బాగా తెలిసిన పార్టీ బీజేపీ. ఇప్పుడు జనంలో ఉన్న అభిప్రాయాలివి. అయితే, ఈ రెండు కారణాలతోనే ఈ రెండు పార్టీలను పదే పదే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం కుదిరే పని కాదని గత 40 ఏళ్ల చరిత్ర చెబుతోంది. 1987–89 మధ్య కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉండగా వెలుగులోకి వచ్చింది బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలు…

Read More

భార‌త్ జోడో యాత్ర‌పై ఏపీ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మాట‌ల్లో…ఎక్స్ క్లూజివ్‌..!

విద్వేషానికి స్వ‌స్తి.. ప్రేమ‌కు నాంది..!! కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ముగిసింది. క‌న్యా కుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు 140 రోజుల పాటు నిర్వ‌రామంగా 75 జిల్లాల గుండా 4080 కిలో మీట‌ర్ల మేర సాగిన యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భించింది. రాహుల్ ఇమేజ్ ఒక్క‌సారిగా పెరిగింది. జోడో యాత్రలో రాహుల్ వెంట పాల్గొన‌డాన‌కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎంపికైనా ఏకైక మ‌హిళ నాయ‌కురాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ‌ర్కింగ్…

Read More

రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తులు ముఖ్యమంత్రి పదవికి అనర్హులు: రఘురామ

ప్రత్యేక హోదా, బడ్జెట్ ప్రొవిజన్ ను సాకుగా చూపెట్టి .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని గుమ్మాల ఎక్కి దిగిన ప్రయోజనం శూన్యమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు సహకరించే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. వైయస్ అవినాష్ రెడ్డిని విచారించిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ లోని అతి కీలకమైన వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు సాక్షి…

Read More

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించడం సిగ్గు చేటు : బండిసంజ‌య్‌

రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలంటే బీఆర్ఎస్ కు అసహ్యమని, ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు యత్నించారన్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదని సంజ‌య్ గుర్తు చేశారు. తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి…

Read More

మూడింట రెండొంతులు ఇంకా బాకీ..!

కొన్ని సంవత్సరాల తర్వాత దేశ ప్రజల దృష్టిని బాగా ఆకర్శించిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యక్రమం ‘భారత్‌ జోడో’ యాత్ర ముగిసింది. పార్టీ ముఖ్య నాయకుడు, దేశానికి ముగ్గురు ప్రధానమంత్రుల్ని ఇచ్చిన కుటుంబపు వ్యక్తిగా రాహుల్‌ గాంధీ ఒక పరీక్ష నెగ్గారు. నిందో, నిజమో తెలియకుండా… ఇన్నాళ్లు రాహుల్‌ పై ఉన్న ఒక విమర్శ తొలగిపోయి, వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ఠ పెరిగింది. ఆయన స్వభావం, వ్యవహార శైలిలోనూ కొంత మార్పు కనిపిస్తోంది. ఇదే క్రమంలో మరో రెండు…

Read More

తెలంగాణలో బీజేపీకి అధికారం కలేనా…?

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నామని పగటి కలలుకంటూ క్షేత్రస్థాయిలో వాస్తవికతను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర బీజేపీ ఢల్లీి హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నా ఢల్లీి పెద్దలు మాత్రం వాటిని పూర్తిగా విశ్వసించక ఆచితూచి అడుగులేస్తున్నారు. అందుకే రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా పార్టీ అధిష్టానం రాష్ట్రంలో విడతలవారీగా అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ రాష్ట్ర నాయకులను అప్రమత్తం చేస్తూన్నా ఇక్కడి లీడర్లు మాత్రం పగటికలలతో ఊహాలోకంలో ఉంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పార్టీ…

Read More

పాదయాత్రలో జగన్ పై లోకేష్ సెటైర్లు..

కుప్పం: ‘యువగళం ‘ రెండో రోజు పాదయాత్రలో భాగంగా నారా లోకేష్..సీఎం జగన్ పై సెటైర్లు పేల్చాడు. పెట్రోల్, డీజిల్ పై పన్ను బాదుడు లో ఏపి నంబర్1 స్ధానంలో ఉందన్న లోకేష్.. ఏపి కంటే కర్ణాటక లో క్వార్టర్ బాటిల్ 100 రూపాయిలు తక్కువన్నారు.విషం కంటే ప్రమాదకరమైన జగన్ లిక్కర్ తాగితే డైరెక్ట్ పైకి పోవడమేనని ఎద్దేవ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో .. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం…

Read More

ప్రచారంలో Hindutva ను దాటిపోతున్న Hindenburg..

Nancharaiah merugumala 🙁 senior journalist) ================== H (ఎచ్/హెచ్) తో మొదలయ్యే మాటల్లో Hindutva తర్వాత ఇప్పుడు భారతదేశంలో పెద్ద స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న మాట Hindenburg (హిండన్ బర్గ్). జర్మన్ సంస్థకు చెందిన ఎయిర్ షిప్ హిండన్ బర్గ్ (1937 ప్రమాదంలో అమెరికా న్యూజెర్సీలో కూలిపోయింది) పేరుతో అమెరికాకు చెందిన నాథన్ (నేట్) ఆండర్సన్ స్టాక్ మార్కెట్ పరిశోధనా సంస్థ నెలకొల్పి, ప్రపంచం కుబేరుల్లో మూడో స్థానం సంపాదించిన భారత బిలియనీర్ గౌతమ్ ఆదానీ…

Read More

‘యువ గళం ‘ పాదయాత్రకు అపూర్వ స్పందన..

కుప్పం: కుప్పంలో నారా లోకేష్ ‘ యువ గళం ‘ పాదయాత్ర రెండో రోజు దిగ్విజయంగా సాగింది. యాత్రకు మద్దతుగా.. రైతులు, విద్యార్దులు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన టొమాటో లు రోడ్ల మీద పారబోసే పరిస్థితి దాపురించందన్నారు.ఎరువులు ధరలు పెరిగిపోయాయి..డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ఎత్తేసారు…..

Read More

కెసిఆర్ హామీలన్నీ నెరవేర్చారు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ఎనిమిదేళ్ళ పాలన లో సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు, 4కోట్ల 24 లక్షల చెక్ లను పంపిణీ చేశారు. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే టీ.ఆర్.ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ గా మారిందన్నారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు…

Read More
Optimized by Optimole