రైతురుణమాఫీ పై కాంగ్రెస్ దరఖాస్తుల ఉద్యమం : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుథ్
Jadcherla: జడ్చర్లలో టిపిసిసి ప్రధానకార్యదర్శి జనంపల్లి అనిరుథెడ్డి సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2018 ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతురుణ మాఫీ పథకం 4 సంవత్సరాలు కావొస్తున్నా అమలు కాకపోవడంతో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి దరఖాస్తుల ఉద్యమం చేపట్టనున్నారు. సోమవారం నుంచి చేపట్టే ఈ కార్యక్రమానికి జడ్చర్ల నియోజకవర్గంలోని మొత్తం అన్నీ గ్రామాల రైతుల నుంచి ధరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం స్వీకరించిన దరఖాస్తులను సీఎం కేసీఆర్, జిల్లా కలెక్టర్లకు, మండల అధికారులతో…