×

హైదరాబాద్, గాంధీభవన్:
రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవల నాణ్యతను పెంచుతూ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో టీపీసీసీ డాక్టర్ సెల్ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గురువారం గాంధీభవన్‌లో ప్రకటించారు. రాష్ట్ర వైస్ చైర్మన్, జనరల్ సెక్రటరీలతో పాటు ఐదు జిల్లాల చైర్మన్లను, పలువురు కీలక పదవులకు సంబంధించిన నియామక పత్రాలను ఈ సందర్భంగా నాయకులకు అందజేశారు. మిగతా నియామకాలను త్వరలో ప్రకటించనున్నట్లు డాక్టర్ సెల్ చైర్మన్ డా. రాజీవ్ తెలిపారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ల సేవలను ప్రశంసిస్తూ, “ఏళ్ల తరబడి బీద ప్రజలకు అండగా నిలుస్తున్న వైద్యులు సమాజంలో ప్రత్యేక గౌరవ స్థానం సంపాదించారు” అని అన్నారు. తాను కూడా డాక్టర్ కావాలని భావించినప్పటికీ పరిస్థితులవల్ల ఆ అవకాశం దక్కలేదని వెల్లడించారు.“చదువుకున్న వ్యక్తులు రాజకీయం వైపు వస్తే క్వాలిటీ గవర్నెన్స్, క్వాలిటీ డెవలప్మెంట్‌కు దారితీస్తుంది. డాక్టర్ వైద్యరంగానికే కాదు సమాజ మార్పుకు కూడా ప్రేరణకారులు కావాలి” అని ఆయన అన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వైద్యరంగం దెబ్బతిన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేలాది ఉద్యోగాల భర్తీతో పాటు ఆరోగ్య రంగ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు డాక్టర్లు ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. డాక్టర్ వై.ఎస్‌. రాజశేఖర్ రెడ్డి ఒక రూపాయి డాక్టర్‌గా ప్రజల్లో ఎంత ప్రేమ పొందారో గుర్తుచేశారు.

డాక్టర్ సెల్ చైర్మన్ డా. రాజీవ్ మాట్లాడుతూ… వైద్య రంగాన్ని శాస్త్రీయ దృక్కోణంతో అభివృద్ధి పరచేందుకు ఈ నియామకాలు కీలకమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ మార్గదర్శకత్వంలో వైద్య సిబ్బంది సంక్షేమం కోసం త్వరలనే సమగ్ర పథకాలు తీసుకురావనున్నట్లు వెల్లడించారు.

ఇక డాక్టర్ సెల్ వైస్ చైర్మన్ డాక్టర్ చిత్తరువు కరిష్ని మాట్లాడుతూ… ఈ నియామకాలు రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ ధృఢ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వసతుల లోపాలను తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.“పరికరాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల పెంపు, వైద్య సిబ్బంది సంక్షేమం, మెడికల్ ఎడ్యుకేషన్‌లో సంస్కరణలు కమిటీల తొలి దశ పరిశీలన అంశాలు అవుతాయి” అని అన్నారు.

వైద్యరంగం పునర్నిర్మాణ దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నమ్మదగిన వైద్య సేవలు అందించడంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తాయని చిత్తరువు కరిష్ని విశ్వాసం వ్యక్తం చేశారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole