మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై ముంబై హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై ఎన్సీపి నేత మంత్రి నవాబ్ మాలిక్, అనిల్ రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్సీపి పార్టీ అధ్యక్షుడు పవార్ సూచన మేరకే అనిల్ రాజీనామా చేసినట్లు మాలిక్ వెల్లడించారు.
కాగా అనిల్ స్థానంలో ఎన్సీపికి చెందిన దిలీప్ వాల్సే పాటిల్ ను హోం మంత్రిగా ఎంపిక చేశారు. అనిల్ రాజీనామ లేఖతో పాటే పటేల్ ఎంపిక విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.