TTD: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు అంగీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈప్రకటన తో తెలంగాణకి చెందిన శ్రీవారి భక్తులు.. సిఫార్సు లేఖలతో టీటీడీ కార్యాలయానికి వెళ్తే అక్కడి అధికారులు వాటిని ఆమోదించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు లేఖల అనుమతిపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసినా.. టీటీడీ బోర్డు సమావేశంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదని తిరుమల సిబ్బంది సమాధానం ఇచ్చినట్లు తెలంగాణకు చెందిన ఓ భక్తుడు ఆవేదనతో మీడియాకి చెప్పుకొచ్చారు. ఈవిషయంపై మంత్రి కొండా సురేఖ.. తక్షణమే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మన్, ఈవోలతో మాట్లాడి సమస్యను పరిష్కారించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.