దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:
స్వయంకృతం
– – – – – – – –
సీ :
గర్వమెవ్వరినైన గతితప్పగాజేయు
వడిజార్చి పడగొట్టు పతనమునకు,
కడు అహంకారమే కడతేర్చు హోదాల
కనరాని పాట్లనే కడ మిగుల్చు,
దర్పమేవిధి సమ్మతము కాదు, సంపద
మిడిసిపాటున దుఃఖమేను కడకు,
‘నేన’నేటి నియంత యెంతటి ఘనుడైన
నాకౌట్ (Knockout) తప్పదేనాటికైన
తే.గీ :
యిన్ని రీతుల కాసుకొనిడుములుండ….
యేల నిశ్చింతగుండెనో యెరుకలేక!
కలలొనైనను ఊహించనలవి కాని
ఓటమాతడ్ని శాపమై కాటు వేసె!
_ రాదిరె✍