లాయల్ గా ఉందాం.. పదవులు పట్టేద్దాం, ప్రజా సమస్యలు మనకెందుకు గురూ!
ప్రభుత్వ ఉద్యోగులంటే పబ్లిక్ సర్వెంట్లు. కానీ, ప్రస్తుతం వాళ్లంతా పొలిటికల్ సర్వెంట్లు అవుతున్నారు. కండువా కప్పుకోని పార్టీ నాయకులుగా మారిపోతున్నారు. రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారులకు మధ్యనున్న చిన్న విభజన రేఖ చెరిగిపోతోంది. రూల్స్ బుక్ లో ఉన్న నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఖద్దరు నాయకుల కాళ్లకు దండం పెట్టే స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ నిర్వహణలో నిజాయితీగా ఉండాలని రూల్స్ చెప్తున్నా, ప్రస్తుతం నిజాయితీ అనే మాటను వింత పదంగా చూసే పరిస్థితి దాపురించింది. వ్యవస్థలో కింది స్థాయి…