నయా ట్రెండ్.. ఏదో మిస్సవుతున్నాం..!
దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): (” ఇదో, ఇదే మిస్సవుతున్నాం! క్రింది సంభాషణలోని సొబగు చూడండి!”) సంఘ జీవనంలోని సౌలభ్యం, సౌఖ్యమిది! ఇలా, ఒకప్పుడు ఊళ్లలో ఉండేది. ఒకప్పుడని ఎందుకంటున్నానంటే… ఇప్పుడు పల్లెటూళ్లు కూడా బాగా మారిపోయాయి. పాత రోజుల్లోలా ప్రేమలు, ఆప్యాయతలు, పరస్పర సహాయ-సహకారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. “ఇంకో గంటయితే ఇడ్వాటింటిక్ పెళ్లి కొడుకు వాళ్లొస్తారు, కమ్మరి దత్తాత్రి దగ్గర పెట్రోమాక్స్ లాంతరుంది తెచ్చావా” అనే ఇంటిపెద్ద పెద్ద స్వరం, “అమ్మనా? శాంతక్కోళ్ల ఇంట్ల ఇవాళ…
వ్యూహకర్తలకు అంత సీన్ ఉందా? గెలిపించగలరా?
ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రశాంత్’ పేరిట మీడియా, సోషల్ మీడియాలో చర్చలు వేడి పుట్టిస్తున్నాయి. మొన్నటిదాక బిగ్‌బాస్ ‘పల్లవి ప్రశాంత్’ సలార్ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’ పేర్లు వైరల్ అయితే, ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసిన రాజకీయ వ్యూహకర్త ‘ప్రశాంత్ కిశోర్’ వైరల్ అవుతున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌కు కూడా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటగా మూడో పార్టీకి సలహాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. నిజంగా వ్యూహకర్తలు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలరా?…
రామ దీక్ష చేపట్టనున్న బండి సంజయ్ కుమార్?
BJPTELANGANA: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ రామ దీక్ష చేపట్టనున్నారు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్, విశ్వహిందూ పరిషత్ హిందూధార్మిక సంఘాలు ఇచ్చిన సలహా మేరకు బండి సంజయ్ దీక్ష చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు కాషాయం పార్టీలో చర్చ జరుగుతోంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ ముఖ్య నేతలు కూడా బండి సంజయ్‌తోపాటు రామ దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే దీక్షకు సంబంధించిన సన్నాహాలు సైతం…
“ఢిల్లీ ఓటు..నరేంద్రమోదీకే”..!
BJPtelangana: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీల నేతలంతా అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోను సత్తచాటలని భావిస్తుంటే..ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ సీట్లు గెలవాలని పట్టుదలగా కనిపిస్తోంది. అటు బీజేపీ మోదీ చరిష్మా మీద నమ్మకంతో గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మరోవైపు పలు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో ప్రజానాడి…
TV9 అధినేత వ్యాఖ్యలపై ఎడిటర్ రజనీకాంత్ జవాబివ్వరా?
Nancharaiah merugumala senior journalist: ‘నేను 2018లో తీసుకునే వరకూ టీవీ 9 ను నక్సలైట్ వ్యవస్థలా నడిపారు,’ అని …‘మైహోం’ జూపల్లి రామేశ్వర్ రావు గారు చెప్పాక కూడా మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజనీకాంత్ జవాబివ్వరా? సోమవారం కడ్తాల్ మండలం మహేశ్వర మహా పిరమిడ్‌లో జరిగిన పత్రీజీ ధ్యాన మహాయాగం ఉత్సవాల్లో పాల్గొన్న మైహోం గ్రూప్ అధిపతి డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు గారు తెలుగు ప్రజలకు తెలియని ఓ కొత్త విషయం వెల్లడించారు. ‘2018లో నేను…
