సీఎం సన్నిహిత సంస్థ ఇండోసోల్ కంపెనీకి వేల ఎకరాల భూ సంతర్పణ: నాదెండ్ల

APpolitics: ‘అడ్డగోలు వ్యవహారాలు… అడ్డదిడ్డమైన నిర్ణయాలతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలు విస్తుగొలిపేలా ఉన్నాయన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రజాధనాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తన అనుకున్న కంపెనీలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి బరి తెగించారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ కంపెనీకి చేసిన భూ కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. చట్టాలను, నిబంధనలను గాలికొదిలేసి మరీ ఆ కంపెనీకు లబ్ధి చేకూర్చడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందన్నారు. కేవలం…

Read More

కాంగ్రెస్ పార్టీ ప్రకటనలపై(యాడ్) నిషేధం..

Telanganaelections2023: అధికార పార్టీల ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలకు(యాడ్) లను నిషేధించిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.ఓడిపోతామని తెలిసి, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ ప్రకటనలను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపింది. అంతేకాదు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రకటనలను ఎన్నికల కమీషన్ నిషేదించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే కేవలం మీడియా ఛానెళ్లలో మాత్రమే ప్రకటనలను నిషేదించడంతో…

Read More

భార్యను గెలిపించుకోవాలని ఉత్తమ్ నయా స్కెచ్..

(nancharaiah merugumala senior journalist): గొల్ల మల్లయ్యను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక డెప్యూటీ సీఎం డీకే శివకుమార్, ‘సరిహద్దు నేత’ రఘువీరారెడ్డిని కోదాడ  రప్పించిన ఉత్తమ్‌ రెడ్డి నిజంగా గ్రేట్‌! బీఆరెస్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రా పీసీసీ మాజీ నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌ రఘువీరారెడ్డిని  శుక్రవారం కోదాడ రప్పించారు నలమాడ…

Read More

మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోరు.. కాంగ్రెస్‌దే పైచేయి..!!

లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్కటైన మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంటే, ఇక్కడ అధికార పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ఐదు…

Read More

సీఎంగా జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం నాకు రాబోతుంది: మల్లు భట్టి విక్రమార్క

Madhira :ఖమ్మం బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి  రాష్ట్రానికి ముఖ్యమంత్రి  ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ  ఖమ్మం జిల్లాకు బిపిఎల్,  స్పాంజ్ ఐరన్ కంపెనీ, హెవీ వాటర్ ప్లాంట్, ఆనేక పరిశ్రమలు ఇచ్చింది.  మళ్లీ ఆలాంటి అవకాశం ఖమ్మం జిల్లాకు రాబోతుంది. మధిర బిడ్డగా నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే అలాంటి అభివృద్ధిని ఖమ్మం కు తీసుకువస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం సిపిఐ తెలుగుదేశం పార్టీ బలపరిచిన  మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా…

Read More
Optimized by Optimole