లాయల్ గా ఉందాం.. పదవులు పట్టేద్దాం, ప్రజా సమస్యలు మనకెందుకు గురూ!
ప్రభుత్వ ఉద్యోగులంటే పబ్లిక్ సర్వెంట్లు. కానీ, ప్రస్తుతం వాళ్లంతా పొలిటికల్ సర్వెంట్లు అవుతున్నారు. కండువా కప్పుకోని పార్టీ నాయకులుగా మారిపోతున్నారు. రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారులకు మధ్యనున్న చిన్న విభజన రేఖ చెరిగిపోతోంది. రూల్స్ బుక్ లో ఉన్న నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఖద్దరు నాయకుల కాళ్లకు దండం పెట్టే స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ నిర్వహణలో నిజాయితీగా ఉండాలని రూల్స్ చెప్తున్నా, ప్రస్తుతం నిజాయితీ అనే మాటను వింత పదంగా చూసే పరిస్థితి దాపురించింది. వ్యవస్థలో కింది స్థాయి…
కాపులకు ఏఏ ముఖ్యమంత్రులు ఎంత మేలు చేశారో లెక్క ఎప్పటికి తేలేను?
Nancharaiah merugumala:( senior journalist) ==================== ఏపీ రాజకీయాల్లో కాపు నేతలే కులం ప్రస్తావన ఎందుకు ఎక్కువగా తెస్తున్నారు? కాపులకు ఏఏ ముఖ్యమంత్రులు ఎంత మేలు చేశారో లెక్క ఎప్పటికి తేలేను? రాజకీయ–సామాజిక అశాంతి ఒక్క కాపుల్లోనే ఎందుకు ఎక్కువవుతోంది? దీర్ఘకాలిక అసంతృప్తి ‘కాపునాడు’ రాష్ట్రం ఏర్పాటు డిమాండుకు దారితీయదా? …………………………………………………………………………………….. మొన్న శుక్రవారం గుంటూరు జిల్లా మాజీ మంత్రి, బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారి మాటలు విన్నాక అఖిలాంధ్ర ప్రజానీకానికి…
సికింద్రాబాద్ సికిందర్ ఎవరు..?
హార్ట్ ఆఫ్ దిపాలిటిక్స్ గా సికింద్రాబాద్ రాజకీయం నడుస్తోంది. మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పద్మారావుగౌడ్.. మరోసారి సీటు నాదేనని ధీమా వ్యక్తం చేస్తుంటే.. కంచుకోట లష్కర్ పై పట్టునిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం ఎట్టిపరిస్థితుల్లో సీటు గెలుచుకోవాలని పట్టుదలగా కనిపిస్తుంది. ప్రతిసారి విభినత్వాన్ని చాటుకునే లష్కర్ ఓటర్లు.. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..! సికింద్రాబాద్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పద్మారావుగౌడ్ కొనసాగుతున్నారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా ఆయన…
వర్థన్నపేటలో గెలిచేదెవరు?ఓడేదెవరు?
వరంగల్ జిల్లా వర్థన్నపేట రాజకీయం సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందా? అధికార బిఆర్ ఎస్ ఎమ్మెల్యేకు అధిష్టానం ఝలక్ ఇచ్చిందనే ప్రచారంలో నిజమెంత? బిఆర్ ఎస్ నేతలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టచ్ లో ఉన్నాడా? కోమాలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? వర్థన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేత అరూరి రమేష్ కొనసాగుతున్నారు. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ.. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అత్యథిక మెజార్టీతో రమేష్ గెలుపొందారు. మరోసారి ఎమ్మెల్యేగా…
నిండు హృదయంతో.. కవివరా నీకిదే నివాళి..!
కవీ! నీ భావసంపదకు వందనాలు, నీ ఊహశాల్యతకు నమస్సులు, నీ కవితా పటిమకు నీరాజనాలు. ఓ IAS అధికారిగా పాలనా గురుతర బాధ్యతల్లో ఉంటూ కూడా తెలుగు సాహితీ సేద్యం చేసిన కృషీవళుడు డా.జె.బాపురెడ్డి. ‘….. అంతరాల ఈ గోడ పగులగొట్టు, సరికొత్త మేడ కట్టు’ అని సినిమా థియోటర్లలో నీ పాట వినిపించే ఆ రోజుల్లో బడికి వెళుతుండిన బాల్యం మాది. సృజనతో, భావుకతతో… ప్రతి మనిషిలో జనించే వ్యక్తావ్యక్త ఆనంద పారవశ్యానికి తార్కిక జ్ఞానంతో,…
కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుంది : నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైందన్నారు నాదెండ్ల. ఈ ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు సాగుతుందన్నారు. రాజకీయ పార్టీ కార్యకర్తలంటే ఇప్పటి వరకు రాజకీయంగా ఉపయోగించుకోవడం వరకే పరిమితం అయ్యేవారని.. జనసేన మాత్రం వారిని ఆపదలో ఉంటే ఆదుకునే ఆలోచన చేసిందన్నారు. కార్యకర్తలకు భరోసా కల్పించడం…..
నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘కంటివెలుగు’ శిబిరం..
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో కంటివెలుగు -2 వైద్య శిబిర కార్యక్రమాన్ని ఎస్పీ అపూర్వరావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ అధికారులు,సిబ్బంది, వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న…
ఏపీలో ఎమ్మెల్సీ సీటు కోసం జర్నలిస్టుల కుస్తీ..?
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోటిచేసే అభ్యర్థులతో పాటు ఆశావాహుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. గవర్నర్ కోటా లేదా శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా.. తమకు అవకాశం కల్పించాలని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన తెలుగు చానళ్లలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వీరేకాక రిటైరైన జర్నలిస్టులు.. జగన్ సొంత మీడియాలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి వ్యక్తి, ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న పేరున్న జర్నలిస్ట్ సైతం టికెట్ కోసం…