ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఫోకస్!
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కమలనాథులు గురిపెట్టారు. గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా కమలనాథులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు ప్రధాని మోదీ.. ఇటు అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో పర్యటించిన మోదీ.. అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూనే… విపక్షాలను ఎండగట్టారు. అలాగే యూపీలో పర్యటించిన అమిత్ షా… సంక్షేమ మంత్రమే ఆయుధంగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక ఉత్తరాఖండ్‌లో…