అంతరిక్షంలోకి మరో తెలుగమ్మాయి..!

అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న ఓ మహిళ అడుగుపెట్టబోతున్నారు. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న ఈ వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కు చోటు దక్కింది. వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె అంతరిక్ష యానం చేయనున్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గానూ వర్జిన్‌ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టనుంది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు…

Read More

దేవునికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి..?

దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి? ఫలితం ఏంటీ? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు వుంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను…

Read More

బెంగాల్ లో రాష్ట్రపతి పాలన..?

బంగాల్లో రాష్ట్రపతి పాలన విధింపుపై కేంద్రం తన వైఖరి తెలియజేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. మే 2న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత బంగాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. విచారణ చేపట్టిన జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరీతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి, బంగాల్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అలాగే.. హింస వల్ల నష్టపోయిన…

Read More

అష్టాదశ శక్తి పీఠాలు విశిష్టత..

పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. పురాణ కథ : ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి)…

Read More

ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం హెచ్చరిక!

ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రవేట్ స్కూల్స్ కి జీవో జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బోధనా రుసుము పెంచినట్లయితే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. జులై 1 నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై విద్యా శాఖ జీవో జారీ చేసింది. బోధన రుసుము మాత్రమే నెలవారీగా తీసుకోవాలని ఉత్తర్వుల్లో విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, అంతర్జాతీయ పాఠశాలలకూ జీవో వర్తిస్తుందని విద్యా శాఖ…

Read More

ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్‌ పదవీకి ధర్మేంద్ర చాతుర్‌ రాజీనామా!

ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి ధర్మేంద్ర చాతుర్‌ తన పదవి నుంచి తప్పుకున్నారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చాతుర్‌.. పదవికి నుంచి తప్పుకోవడానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ సైతం నిరాకరించింది. గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్​కు​ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ధర్మేంద్ర రాజీనామ పరిణామం మరో చర్చకు దారితీసింది. వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త…

Read More

తాజాగా మరో వేరియంట్ వెలుగులోకి..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో డెల్టా, డెల్టాప్లస్​, వంటి వేరియంట్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో కొత్తరకం వేరియంట్ ‘లాంబ్డా’​ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్​ ఇప్పటివరకు 29 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. బ్రిటన్​లో ఇప్పటివరకు ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. లాంబ్డా వేరియంట్ తొలుత గతేడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్​, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్…

Read More

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి!

ఊహాగానాలకు తెరదించుతూ.. ముందునుంచి అనుకున్నట్లే తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని ఏఐసిసి నియమించింది. సీనియర్ నేతలు టి.జగ్గారెడ్డి, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లతో పాటు అజారుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, రమేశ్‌ ముదిరాజ్‌,…

Read More

కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు తక్కువే : ఐసిఎంఆర్

భారత్​లో కరోనా థర్డ్ వేవ్ వచ్చేందుకు అవకాశం ఎంత మేర ఉంది? ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కొంటాం? వీటన్నిటికీ ఐసీఎంఆర్ చెప్తున్న సమాధానం ఏమిటీ? కరోనా సృష్టించిన బీభత్సానికి ప్రపంచమంతా అతలాకుతలమైంది. దానికి తోడు.. ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు’ చందంగా సెకండ్ వేవ్ కోలుకోలేని దెబ్బతీసింది. అంతేకాక మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో భయంతో జనం వణికిపోతున్న తరుణంలో ఐసిఎంఆర్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడో దశ వచ్చేందుకు అవకాశాలు…

Read More

మరో సారి ట్విట్టర్ _ కేంద్రం వార్..?

_కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతా గంట నిలిపివేత! కేంద్రం, ట్విట్టర్ మధ్య మరోసారి అగ్గిరజుకుంది. దీనికి కారణం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఖాతాను సామాజిక మాధ్యమ సంస్థ గంట పాటు నిలిపివేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి వెల్లడించడం గమనార్హం. గత కొంతకాలంగా ట్విటర్‌, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయానికి సంబంధించి ట్వీట్ చేస్తూ…..

Read More
Optimized by Optimole