కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు..

కామన్వెల్త్ గేమ్స్‌_2022 లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం అతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ సేన 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌ కి చేరింది. దీంతో భారత్ కు మరో పతకం ఖాయమైంది. అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. కేవలం 32 బంతుల్లో…

Read More

స్వర్ణపతక వీరుడు ‘నీరజ్’ ప్రస్థానం..

ఒకసారి యుద్ధం మొదలెట్టాక గెలవాలి లేదా ఓడాలి.. ఈడైలాగ్ సరిగ్గా సరిపోతుంది ఆటగాళ్లకి. ఆటలో గెలిచిన వాళ్లు చరిత్ర సృష్టిస్తారు. ఓడినవాళ్లు గుణపాఠాన్ని నేర్చుకుంటారు.జావెలిన్‌ త్రో ఆటగాడు స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ప్రస్థానం అలాంటిందే. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అతను.. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి ప్రతిష్టతను రెపరెపలాడించాడు. తాజాగా అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ నీరజ్ 88.13 మీటర్ల మేర జావలిన్‌ విసిరి సిల్వర్‌…

Read More

అంత బుద్ధి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నడిచేవాణ్ణే: కమల్ హాసన్

Nancharaiah merugumala: …………………………………………. ”అప్పుడు (1975-77) నాకంత రాజకీయ చైతన్యం ఉండి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డిల్లీ వీధుల్లో నడిచేవాడిని.”  ఇటివల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలో ‘భారత్ జోడో యాత్ర’లో తాను నడవడం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, ఎమర్జెన్సీనికి సమర్ధనగా భావించారాదని అంటూ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆదివారం ఆరో కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొంటూ ఎమర్జెన్సీపై అడిగిన ప్రశ్నకు ఈ జవాబిచ్చారు కమల్. తమిళ బ్రాహ్మణ కాంగ్రెస్…

Read More

కోకా సుబ్బారావు తర్వాత రెండో తెలుగు దివిటీ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ

Nancharaiah Merugumala (senior journalist): రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకూ పొన్నవరం పౌరుడి యాత్ర ———————————————— కలిమి జలాక్షరాలు… చెలిమి శిలాక్షరాలు. సంపద నీటిపై అక్షరాలు రాయడం వంటిదైతే…స్నేహం రాతిపై చెక్కే శాసనంలా శాశ్వతమైనదని-మొదటి నాలుగు మాటల అర్థం ఇది. — బార్ అసోసియేషన్ తో తనకు ఉన్న అనుబంధం గురించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ గురువారం ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని…

Read More

అవినీతిపై ప్రధాని ఆంధ్రాలోనూ సర్పయాగం నిర్వహించాలి: ఎంపీ రఘురామ

అవినీతి సర్ఫాల ఆట కట్టించేందుకు ఢిల్లీలో మొదలుపెట్టిన సర్పయాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొనసాగించాలని కోరారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఢిల్లీ మద్యం కుంభకోణం స్ఫూర్తితో, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మద్యం కుంభకోణంపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో అసలు మద్యం కుంభకోణం అన్నదే చోటు చేసుకోలేదని తేలితే తమ పార్టీకే మంచిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మద్యం కొనుగోళ్లు, అమ్మకాలు, నగదు లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర…

Read More

కేసీఆర్‌ సారూ … ఆకు పచ్చ మునుగోడు ఏమాయే :గంగిడి మనోహర్‌రెడ్డి

(డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర) ప్రత్యేక వ్యాసం : =========================== ఉద్యమ సమాజాన్ని పక్కకు పెట్టి ‘తెలంగాణ నేనే తెచ్చిన-నేనే తెచ్చిన’ అనుకుంటూ కేసీఆర్‌ తనను తానే కీర్తించుకుంటూ తిరుగుతున్నరు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో బిజెపి పాత్ర ఎంతో ఉంది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన మొట్టమొదటి పార్టీ బిజెపి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పార్లమెంటులో, బయటా గట్టిగా పోరాడిరది బిజెపి. ఈ…

Read More
Optimized by Optimole