అవినీతిపై ప్రధాని ఆంధ్రాలోనూ సర్పయాగం నిర్వహించాలి: ఎంపీ రఘురామ
అవినీతి సర్ఫాల ఆట కట్టించేందుకు ఢిల్లీలో మొదలుపెట్టిన సర్పయాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొనసాగించాలని కోరారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఢిల్లీ మద్యం కుంభకోణం స్ఫూర్తితో, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మద్యం కుంభకోణంపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో అసలు మద్యం కుంభకోణం అన్నదే చోటు చేసుకోలేదని తేలితే తమ పార్టీకే మంచిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మద్యం కొనుగోళ్లు, అమ్మకాలు, నగదు లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర…