Poetry: మూల్యం విలువ..!
Panyalajagannathdas: మూల్యం.. ఏదీ ఆశించకుండా ఉండటం, దేనినీ జ్ఞాపకాల్లో దాచుకోకుండా ఉండటం, తిరిగి రావడానికి సొంత నేలనేది లేకుండా ఉండటం చాలా మంచిదని నాకు తెలుసు. అయితే, అలాంటి పరిస్థితుల్లో మనకు కవితలేవీ అర్థంకావు. నాకు బాగా తెలుసు నీలాంటి మంచి కవితలన్నిటికీ వాటి మూల్యం ఉంటుంది. మంచి కవితలన్నీ మన మనోవేదనను మూల్యంగా చెల్లించుకున్నాకే రూపు దిద్దుకుంటాయి. — ఆస్టురియన్ మూలం: జీ ఎం. సంచేజ్ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు