నూతన వ్యవసాయ చట్టాలను ఏడాదిపాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. వార్షిక బడ్జెట్ కి సంబంధించి నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టాల విషయమై రైతు సంఘాలతో చర్చించేందుకు ఇప్పటికి సిద్ధమేనని .. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ చేసిన ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ స్పష్టం చేశారు.
ఇక సాగు చట్టాల గురించి రైతులు కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిది దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో చట్టాల నిలుపుదలను ఏడాదిపాటు పాటు నిలిపివేసే ప్రతిపాదనను కేంద్రం రైతుల ముందుంచింది.