వేట మొదలైంది…. వేటాడానికే పులి వచ్చింది: బండి సంజయ్

BJPTelangana:‘‘ కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేనొక్కటే చెప్పిన….  మీరేం భయపడకండి… ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండి’’అంటూ రెచ్చిపోయారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఆదివారం  చేవెళ్ల జరిగిన ‘‘విజయ సంకల్ప…

Read More

ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీజేపీదే అధికారం: జేపీ నడ్డా

తెలంగాణలో బూత్ స్థాయిలో బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ ఐసీసి నోవా హోటల్ లో శనివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ రాజ్యసభ బిజెపి పక్ష నేత పీయూష్ గోయల్, కేంద్ర హోం మంత్రి అమీషా యుపి సీఎం యోగితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు పలువురు కేంద్ర మంత్రులు జాతీయ నేతలు…

Read More

బీజేపీలోకి విశ్వేశ్వర్ రెడ్డి.. మరో ఎమ్మెల్యే చేరే అవకాశం?

తెలంగాణలో బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ.. ఆపార్టీలోకి చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.. ప్రధాని మోదీ సమక్షంలో ఆపార్టీలో చేరనున్నట్లు ప్రకటించాడు.అధికార టీఆర్ ఎస్ ఎదుర్కొవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యమని.. అందుకే బీజేపీలో చేరుతున్నానని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు నల్గొండ, ఖమ్మంతో పాటు పలుజిల్లాలకు చెందిన ముఖ్యనేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ప్రధాని మోదీ ,…

Read More

ప్రధాని మోదీ బాధనూ దగ్గరినుంచి చూశాను :అమిత్ షా

2002 గుజరాత్ అల్లర్లకి సంబంధించి కేంద్రహోమంత్రి అమిత్ షా ఓ వార్త సంస్థ ఇంటర్వ్యూలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.శివుడు కంఠంలో విషాన్నిదాచుకున్నట్లుగా.. ప్రధాని నరేంద్రమోదీ 19ఏళ్లుగా అసత్య ఆరోపణల భారాన్ని మోస్తూన్నారని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే దురుద్దేశంతో మోదీ ప్రతిష్టను మసక బార్చెందుకు విష ప్రచారం చేశారని ఆరోపించారు. అల్లర్ల విషయంపై.. 19 ఏళ్లుగా మోదీ ఏ నాడూ పెదవి విప్పలేదని గుర్తుచేశారు. ప్రధాని బాధను చాలా ద‌గ్గ‌ర నుంచి చూశానన్నారు. కేసు విచారణకు హాజరయ్యే…

Read More

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ దాఖలు..!!

presidentelection2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి పీసీ మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసేందుకు ఆమె వెంట ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రతిపాదించగా.. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదనను బలపరిచారు. ఇక నామినేషన్ కు ముందు…

Read More

రాజ్యసభలో బీజేపీ అరుదైన రికార్డు!

పెద్దల సభ(రాజ్యసభ)లో బీజేపీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. చరిత్రలో తొలిసారి ఆ పార్టీ బలం 100కి చేరడంతో..1990 తర్వాత ఓ పార్టీ ఎగువసభలో వంద సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బీజేపీకి 97 మంది సభ్యులు ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాలను కమలదళం గెలుచుకోవడంతో ఆ పార్టీ 100 సీట్ల మైలురాయిని చేరుకుంది. కాగా 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాజ్యసభ లో బీజేపీ…

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఫోకస్!

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కమలనాథులు గురిపెట్టారు. గోవా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా కమలనాథులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు ప్రధాని మోదీ.. ఇటు అమిత్‌ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో పర్యటించిన మోదీ.. అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూనే… విపక్షాలను ఎండగట్టారు. అలాగే యూపీలో పర్యటించిన అమిత్‌ షా… సంక్షేమ మంత్రమే ఆయుధంగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక ఉత్తరాఖండ్‌లో…

Read More

పంజాబ్ పీఠం పై కమలనాధుల గురి!

పంజాబ్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో పంజాబ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ ట్రబుల్‌ షూటర్‌ అమిత్​షా ట్రయాంగిల్​ స్కెచ్ వేశారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ సీఎం అమరిందర్‌సింగ్‌, శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుకు తాము సిద్ధమని ప్రకటించారు. కూటమి ఏర్పాటు కోసం ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలతో కమలనాథులు చర్చించినట్లు తెలిసింది. ఈపరిణామం ప్రతిపక్ష పార్టీలు పెద్ద దెబ్బగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పంజాబ్‌ల…

Read More

కశ్మీర్​ శాంతికి విఘాతం కల్గించాలని చూస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదు_ అమిత్ షా

జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. జమ్మూలో యూత్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అక్కడి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం స్థానిక యువత బాధ్యత అని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి యువకులతో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం.. ఆర్టికల్ 370ని రద్దు కారణంగా కశ్మీర్​లో ఉగ్రవాదం, అవినీతి, వారసత్వ రాజకీయానికి చరమగీతం…

Read More

ఓటమి భయంతోనే దీదీ ఆరోపణలు : అమిత్ షా

ఓటమి భయంతోనే దీదీ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం తధ్యమని షా జోస్యం చెప్పారు. నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పోలింగ్ జరిగిన స్థానాల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. తృణమూల్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో…

Read More
Optimized by Optimole