Apnews: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పై ప్రజాభిప్రాయం: పీపుల్స్ పల్స్

Peoplespulse: రాష్ట్ర ఖజానాపై తక్కువ భారంతోనే ఆంధ్రప్రదేశ్ లోని 70 శాతం పైగా కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ది చేకూరుస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం-2) పథకాన్ని చిన్న చిన్న మార్పులతో మరింత ప్రభావవంతగా అమలు జరుపవచ్చు. ఇప్పుడున్న పద్దతిలోనే నడిపిస్తే… లబ్దిదారులు సంతృప్తి చెందక పోగా పథకం ప్రజాదరణ కోల్పోయి, రాజకీయ లబ్ది కూడా మిగలని ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. ప్రజాభిప్రాయం ప్రకారం, ‘జీరో బిల్లింగ్’పద్దతిలో ఉచిత సిలిండర్ అందించడమనే చిన్న సాంకేతిక మార్పు ద్వారా…

Read Full News

Apnews: ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం: నాదెండ్ల మనోహర్

Janasena: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరిందన్నారు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం  రూ. 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోళ్లు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏమాత్రం ఇబ్బందిపెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు పేర్కొన్నారు….

Read Full News

APpolitics: కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు: డిప్యూటీ సీఎంపవన్

NDA: గత అయిదేళ్లలో శాసన సభ్యులంటే బెదిరింపులు, బూతులు అనే ధోరణిని చూశారు… ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి శాసన సభ్యుల్లో ఓ సుహృద్భావ వాతావరణం, సోదరభావం పెంపొందించేందుకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం శుభ సంప్రదాయం’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఐక్యతతో, పోరాట పటిమతో, సమష్టిగా ముందుకు సాగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కాగా రెండు రోజులుగా సాగిన క్రీడా పోటీలు, గురువారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో…

Read Full News

Peoplespulse: డొక్కా సీతమ్మ పథకం అమలు తీరుపై పీపుల్స్ పల్స్ అధ్యయనం..!

DokkaSeethammascheme: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై పీపుల్స్ పల్స్ అధ్యయన సమగ్ర నివేదిక.. ఇంటర్‌ విద్యార్థులకు: జీవితంలో ఎవరి కెరీర్‌ కైనా ఇంటర్మీడియటే టర్నింగ్‌ పాయింట్‌. ఇంటర్‌ లోనే విద్యార్థులు తమ జీవితానికి పునాదులు వేసుకుంటారు. ఇంటర్‌ నుంచి బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్నత ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకోవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. అదికూడా సరైన పోషకాహారం…

Read Full News

janasena: న భూతో న భవిష్యతి అనేలా ఆవిర్భావ సభ: నాదెండ్ల

Janasena: ‘పిఠాపురం జనసేన పార్టీకి ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభకు కూడా పిఠాపురం వేదిక అయింది. ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పుకొందాం.. థాంక్యూ పిఠాపురం’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని న భూతో అన్న రీతిలో…

Read Full News

ysrcp: వైసీపీలో ఏం జరుగుతోంది..?

APpolitics: ‘‘వైసీపీలో ఏం జరుగుతోంది?’’ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, రాజీనామ తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశారు. ముందు ముగ్గురు రాజీనామాల్లో అంత ప్రత్యేకత ఏమీ లేకపోయినా స్వయం ప్రకటిత జగన్ ఆత్మ అయిన విజయసాయిరెడ్డి రాజీనామ ప్రత్యేకమైనది. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసిన ఆయన, జగన్ కష్టకాలంలో…

Read Full News

APNEWS: గ్రామాల్లో పనులు పండుగలా మొదలుపెట్టాలి: డిప్యూటీ సిఎంపవన్

PawanKalyan:   ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏపీ లో కూటమి పాలన( ఎన్డీయే )మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని ఆయన  స్పష్టం చేశారు. పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి…

Read Full News

OBC: ‘ఓసీ’ ఎంపీలను చూసి ఓబీసీ ఎంపీలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారే!

Nancharaiah merugumala senior journalist: తెలుగు నాట‘ఓసీ’ ఎంపీలను చూసి ఓబీసీ ఎంపీలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారే! 2019 ఆంధ్రప్రదేశ్‌ సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయాక, ఈ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఉరఫ్‌ సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ టీడీపీ నుంచి చీలిక పేరుతో బయటపడ్డారు. ఆ చీలికను నాటి రాజ్యసభ చైర్మన్‌ అయిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గుర్తించారు. అలాగే, చీలిక ప్రక్రియ…

Read Full News

SanatanDharma: సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం: పవన్

PawanKalyan: ‘పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో అపవిత్రం జరిగితే వైసీపీ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నా’రని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  మండిపడ్డారు. జగన్ నియమించిన టీటీడీ బోర్డులో తప్పు జరిగిందని ల్యాబ్ రిపోర్టులతో సహా విషయం బయటకు వచ్చినా దబాయింపు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తప్పు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని మాట్లాడాలి లేదా అప్పటి బోర్డులో ఉన్న అధికారులు, బోర్డు సభ్యులు ప్రమేయం మీద మాట్లాడాలి.. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడడం…

Read Full News

Tenali: జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి: నాదెండ్ల మనోహర్

Nadendlamanohar: ‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాద’ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లనూ, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రైతుల నుంచి ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని దోచుకున్న…

Read Full News
Optimized by Optimole