యూపీలో ప్రారంభమైన తొలివిడత పోలింగ్!

దేశంలో అత్యధిక దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల యూపీలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. కాగా మొదటి విడతలో భాగంగా 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2.27 కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మోదీ ట్వీట్.. యూపీ తొలి విడత ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ…

Read More

యూపీ మరోసారి బీజేపీదే_ అమిత్ షా

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి 300పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా. శుక్రవారం గోరఖ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్షా మాట్లాడుతూ..2014, 2017, 2019 మాదిరి.. ఈ సారి కూడా యూపీలో గెలిచేది బీజేపీ అని అమిత్షా స్పష్టం చేశారు. 2013లో తాను యూపీ బీజేపి ఎన్నికల ఇంచార్జ్గా వచ్చానని.. అప్పుడు అందరూ కనీసం బీజేపికి రెండంకెల సీట్లు వస్తే గొప్ప విషయమన్నారు. కానీ ఎన్నికల తర్వాత…..

Read More

సీఎం యోగి గెలుపు కోసం రంగలోకి ‘హిందూ యువవాహిని ‘

ఉత్తరప్రదేశ్లో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనాయకులు రాష్ట్రంలో పర్యటిస్తు.. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇక సీఎం యోగి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేస్తుండటంతో .. తన మానస పుత్రిక హిందూ యువవాహిని ఆయన గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకుంది. ఇరవై ఏళ్ల క్రితం గోరఖ్పుర్ మఠాధిపతిగా యోగి స్థాపించిన ఆసంస్థ.. గత కొన్నేళ్లుగా నిద్రాణంలోనే ఉంది. ఇప్పుడు గోరఖ్పుర్…

Read More

యూపీ పై బీజేపీ ఫోకస్!

యూపీపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ సర్కార్‌. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో అనేక అభివృద్ది పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేశారు. గంగా ఎక్స్​ప్రెస్​వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్​ప్రదేశ్​ నిలుస్తుందన్నారు. అటు యోగీ ఆదిత్యనాథ్‌ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. యూపీ ప్లస్ యోగి…

Read More

పంజాబ్ లో బీజేపీ పొత్తు ఖరారు!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికి.. పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్​ పార్టీతో బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. అమరీందర్ సింగ్​తో భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి, పంజాబ్ బీజేపీ ఇన్​ఛార్జ్​ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రతి స్థానాన్ని పరిశీలించి, పరిస్థితులనుబట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో…

Read More

హుజరాబాద్ ఉప సమరం పై పార్టీల కసరత్తు!

తెలంగాణ రాజకీయం అంతా ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక మీదే కేంద్రీకృతమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ సవాల్గా తీసుకున్నాయి. బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అభ్యర్థిత్వం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పై ఎన్నికల సమావేశమైంది. ఈ మేరకు ఉప ఎన్నికకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. కాగా…

Read More

అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది: ఖుష్బూ

బీజేపీ పై విమర్శలు చేసిన వారికి నటి కుష్బూ తనిదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకొని వికసించదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించలేదంటూ విమర్శలు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఖాతా తెరవని పార్టీ, ఈసారి నాలుగు స్థానాలు గెలుచుకుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, రానున్న రోజుల్లో అధికారంలోకి కమలం పార్టీ రావడం ఖాయమని…

Read More

టీఎంసీ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతుంది : జేపీ న‌డ్డా

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అద్భుత ఫ‌లితాలు సాధిస్తుంద‌ని భాజాపా జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ధీమా వ్య‌క్తం చేశారు. ఆదివారం ఓవార్త సంస్థ ఇంట‌ర్య్వూలో ఆయ‌న మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ప‌శ్చిమ్ బెంగాల్లో రాబోయే రోజుల్లో బీజేపి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుందని.. అసోంలో అధికారాన్ని నిల‌బెట్టుకుంటాం. తమిళనాడులో అధికార కూటమిలో కీలకంగా ఉంటామని.. పుదుచ్చేరిలో అధికారాన్ని చేజికిచ్చుకుంటాం. కేరళలో కీలకంగా నిలుస్తామని న‌డ్డా పేర్కొన్నారు. ఓట‌మి భ‌యంతో టీఎంసీ…

Read More

తృణ‌మూల్ కుట్ర‌లకు పాల్పడుతోంది : ప్ర‌ధాని మోదీ

బెంగాల్ నాలుగో ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌లు రక్త‌సిక్త‌మ‌య్యాయి. శ‌నివారం కూచ్‌బెహార్ జిల్లాలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న‌ పోలీసుల నుంచి స్థానికులు తుపాకులు లాక్కొనేందుకు ప్ర‌య‌త్నించడంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. శ‌నివారం ఉద‌యం పోలింగ్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికి ఓట్లు వేయ‌డానికి వచ్చిన వారిపై కొంద‌రు రాళ్లు రువ్వార‌ని, భ‌ద్ర‌త బ‌ల‌గాల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగార‌ని, త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో పోలీసులు కాల్పులు జ‌రిపిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాక కూచ్‌బెహార్ జిల్లాలోని మ‌రో…

Read More

బెంగాల్లో పీకే ఆడియో క‌ల‌క‌లం!

ప‌శ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఆడియో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఆడియోలో కొంద‌రు జ‌ర్న‌లిస్ట్‌ల‌తో ఆయ‌న జ‌రిపిన సంభాష‌ణ‌ల సారాంశాన్ని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ సోష‌ల్ మీడియాలో పొస్ట చేశారు.’ బెంగాల్‌లో మోదీకి జ‌నాద‌ర‌ణ ఉంది. ఆయ‌న్ని దేవుడిలా ఆరాధిస్తున్నారు. రాష్ట్రంలోని టీఎంసీకి వ్య‌తిరేకత అధికంగా ఉంది. ఓట్లు చీలిపోతున్నాయి. ద‌ళితులు, మ‌తువా ఓట్ల‌తో పాటు, క్షేత్ర స్థాయిలో ఆపార్టీ యంత్రాంగం పనితీరు బీజేపికి క‌లిసోస్తుంది….

Read More
Optimized by Optimole