బీజేపీలోకి మరో కాంగ్రెస్ నేత!
తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన మోహన్ రావు పాటిల్ భోస్లే, ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బుధవారం బిజెపిలో చేరారు. ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, ఎన్.రాంచందర్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనపై నమ్మకంతో చాలామంది పార్టీలో చేరుతున్నారని.. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా చాలామంది పార్టీలో చేరుతారని అన్నారు….