ఎవరి అభివృద్ధి కోసం మునుగోడు ఉప ఎన్నిక..?
ఓటరు మహశయులారా..! ఎవరు అవునన్నా..కాధన్నా..ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నికలు రాజ్యాంగ వ్యవస్థ కు లోబడి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిందే.ప్రజల ఆకాంక్షలు,విశ్వాసాల మేరకే నియమిత కాలానికి ప్రభుత్వాలు ఏర్పడతాయి.రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.మీరు ఎన్నుకున్నవారు సరిగా పనిచేయడం లేదని బావించినప్పుడు మీదే అంతిమ నిర్ణయాధికారం.శాసన కర్తల అంతిమ లక్ష్యం సుపరిపాలన.అనాటి కాలంలోనే అరిస్టాటిల్”వ్యక్తుల పాలన కన్నా చట్టాల పాలన శ్రేష్టమైనది” అని చెప్పారు.కాబట్టి ప్రభుత్వాల ఏర్పాటు, ఎన్నికలు,నిర్మాణం,నిర్వాహణ అంతిమ లక్ష్యం “ప్రజా విశ్వాసం”…
